న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘#మీటూ’ ఉద్యమం: లైంగిక వేధింపులపై పీవీ సింధు స్పందన ఇదీ

#MeToo: P V Sindhu Responds On Me Too Campaign
Badminton star PV Sindhu lends her support to #metoo movement

హైదరాబాద్: '#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం సినిమా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తున్నారు.

మీటూ ఉద్యమం: తానూ గొంతెత్తిన జ్వాలా గుత్తామీటూ ఉద్యమం: తానూ గొంతెత్తిన జ్వాలా గుత్తా

మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల సైతం తాను కూడా వేధింపులకు గురయ్యానని.. కాకపోతే అవి మానసిక వేధింపులు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ 'మీటూ' ఉద్యమానికి బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మద్దతు తెలపడం విశేషం. మహిళలు తమకు జరిగిన వేధింపులను బహిరంగంగా వ్యక్తం చేస్తుండడాన్ని మంచి పరిణామంగా సింధు పేర్కొంది.

పీవీ సింధు ఈ ‘మీటూ’ ఉద్యమంపై మాట్లాడుతూ

పీవీ సింధు ఈ ‘మీటూ’ ఉద్యమంపై మాట్లాడుతూ

బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు ఈ ‘మీటూ' ఉద్యమంపై మాట్లాడుతూ "వేధింపులపై ముందుకొచ్చి మాట్లాడుతున్న వారిని అభినందిస్తున్నాను.. గౌరవిస్తున్నాను" అని సింధు తెలిపింది. మీరెప్పుడైనా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నారా అన్న ప్రశ్నకు గాను సింధు తనదైన శైలిలో స్పందించింది.

 ఇలాంటి ఘటనలను చవిచూడలేదు

ఇలాంటి ఘటనలను చవిచూడలేదు

"సీనియర్లు, కోచ్‌ల గురించి నాకు తెలియదు. నావరకైతే.. బ్యాడ్మింటన్‌లో నేను ఎప్పటినుంచో కొనసాగుతున్నా.. ఇలాంటి ఘటనలను చవిచూడలేదు" అని సింధు బదులిచ్చింది. మంగళవారం ‘మీటూ'కు హ్యాష్‌ ట్యాగ్‌ చేస్తూ గుత్తా జ్వాల.. తనను ఒక చీఫ్‌గా పనిచేసిన ఓ వ్యక్తి మానసికంగా వేధించాడంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

 మీటూ ఉద్యమంపై గొంతెత్తిన జ్వాల గుత్తా

మీటూ ఉద్యమంపై గొంతెత్తిన జ్వాల గుత్తా

"#మీటూ ద్వారా నేను నాకు ఎదురైన మానసిక వేధింపులు గురించి వెల్లడించాలనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్‌ అయ్యాడు. అప్పటి నుంచి నన్ను మానసిక వేధింపులకు గురి చేశాడు. జాతీయ క్రీడాకారిణిని అయిన నన్ను జట్టు నుంచి బయటకు పంపించాడు. నేను బ్యాడ్మింటన్‌కు రాజీనామా చేయడానికి ఇది కూడా ఓ కారణం. నన్ను బయటకు పంపించడమే కాకుండా నాతో పాటు ఆడే నా భాగస్వాములను కూడా బెదిరించాడు. నేను రియో ఒలంపిక్స్‌ నుంచి వచ్చిన తరువాత కూడా ఈ వేధింపులు కొనసాగాయి. నేను ఎవరితో అయితే కలిసి మిక్స్‌డ్ ఆడతానో తనను కూడా బెదిరించారు. దాంతో నేను జట్టు నుంచి బయటకు వచ్చేశాను" అంటూ గుత్తా జ్వాల ట్వీట్‌ చేసింది.

Story first published: Thursday, October 11, 2018, 10:47 [IST]
Other articles published on Oct 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X