న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇద్దరూ ఇద్దరే: సంపాదనలో సింధు, ఫాలోవర్స్‌లో సైనా నెహ్వాల్

Badminton: saina nehwal is the most popular badminton player in social media

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌లో స్టార్ ప్లేయర్లుగా సైనా నెహ్వాల్, పీవీ సింధులు వెలుగొందుతున్నారు. ఎన్నో సూపర్ సిరీస్ టైటిల్స్‌తో పాటు ప్రతిష్టాత్మక ఒలింపిక్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌‌లోనూ పతకాలు సాధించిన ఈ ఇద్దరూ దేశానికే గర్వకారణంగా నిలిచారు.

<strong>ఇండియా vs ఆస్ట్రేలియా: అడిలైడ్ టెస్టులో టాప్-4 ప్రదర్శనలివే</strong>ఇండియా vs ఆస్ట్రేలియా: అడిలైడ్ టెస్టులో టాప్-4 ప్రదర్శనలివే

అయితే రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజత పతకం సాధించడం ఆమె కెరీర్‌నే మార్చివేసింది. అంతేకాదు సంపాదనలో సైనా నెహ్వాల్‌ను సింధు మించిపోయేలా చేసింది. ముఖ్యంగా పాపులారిటీ, క్రేజ్ విషయంలో భారత బ్యాడ్మింటన్‌లో ఏ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి అందనంత ఎత్తుకు పీవీ సింధు చేరింది.

అయితే సోషల్ మీడియాలో సైనాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలిస్తే ఎంతో ఆశ్చర్యపోతారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధిస్తే... 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకంతో మెరిసింది. 2012 ఒలింపిక్స్‌‌లో ప్రత్యర్ధి పోటీ మధ్యలోనే తప్పుకోవడంతో సైనా కాంస్య పతకం సొంతం చేసుకుంది.

సింధు విషయానికి వస్తే

సింధు విషయానికి వస్తే

సింధు విషయానికి వస్తే, 2016 ఒలింపిక్స్‌లో ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓటమిపాలై రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించడంతో సింధుకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది.

సింధు కంటే సైనా ముందంజ

సింధు కంటే సైనా ముందంజ

రియో ఒలింపిక్స్ అనంతరం సింధుకు పెద్దఎత్తున బ్రాండ్ అండార్స్‌మెంట్స్, కమర్షియల్ యాడ్స్ ద్వారా సంపాదన పెరిగింది. దీంతో మిగతా మహిళా క్రీడాకారులందరినీ మించిపోయింది. అయితే, సోషల్ మీడియాలో సింధు కంటే సైనా నెహ్వాల్ ముందుంది. సైనాకు ట్విట్టర్‌లో 80 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

ఫేస్‌బుక్‌లో 79 లక్షల మంది

ఫేస్‌బుక్‌లో 79 లక్షల మంది

ఫేస్‌బుక్‌లో 79 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో సైనా అధికారిక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో కలిపి కోటీ 72 లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇక, సింధు విషయానికి వస్తే పీవీ సింధుకు ట్విట్టర్‌లో 25 లక్షలు ఫేస్‌బుక్‌లో 13 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

సింధుతో పోలిస్తే సైనాకే ఎక్కువ ఫాలోయింగ్

అయితే, అన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో కలిపి సింధును ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలు. సింధుతో పోలిస్తే సైనాకే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషం. సంపాదనలో సింధు ముందంజలో ఉన్నప్పటికీ ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం సైనానే అగ్రస్ధానంలో ఉంది.

టాప్-100 సెలబ్రిటీల జాబితాలో

టాప్-100 సెలబ్రిటీల జాబితాలో

ఇటీవల ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్-100 సెలబ్రిటీల జాబితాలో సైనా నెహ్వాల్ రూ.16.54 కోట్ల ఆదాయంతో 58వ ర్యాంక్‌లో నిలవగా, పీవీసింధు ఈ జాబితాలో 20వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పీవీ సింధు రూ.36.5 కోట్లకు పైగా ఆర్జించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, December 12, 2018, 19:33 [IST]
Other articles published on Dec 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X