న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాడ్మింటన్ లెజెండ్ 'లిన్ డాన్' సంచలన నిర్ణయం!!

Badminton Legend Lin Dan Announces Retirement

బీజింగ్: చైనా బ్యాడ్మింటన్ లెజెండ్, రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్ లిన్ డాన్ సంచలన ప్రకటన చేశారు. 36 ఏళ్ల చైనా బ్యాడ్మింటన్ స్టార్ లిన్ డాన్.. తాను రిటైర్‌ అవుతున్నట్లు శనివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో లిన్ డాన్ బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించిన లిన్ తన అద్భుత ఆటతో చైనాకు ఎన్నో పతకాలు అందించారు. అతనితో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి ఆటగాళ్లు వణికేవారు.

లిన్ డాన్ రిటైర్మెంట్ ప్రకటనతో వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనబోరు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో.. ఆ క్రీడల్లో లిన్ డాన్ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. తన గొప్ప ప్రత్యర్థి అయిన మలేషియా స్టార్, స్నేహితుడు లీ చోంగ్ వీ రిటైర్ అయిన ఏడాది తర్వాత లిన్ రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. లీ చోంగ్ వీ, లిన్ డాన్ లు దశాబ్దానికి పైగా క్రీడల్లో ఓ వెలుగువెలిగారు. చిన్న వయస్సులో చెడ్డ బాలుడు అని పేరు తెచ్చుకున్న లిన్ డాన్.. 666 సింగిల్స్ విజయాలు, ఎన్నో పతకాలు సాధించారు.

'నాకు కష్టతరమైన సమయంలో కుటుంబం, కోచ్‌లు, జట్టు సభ్యులు, అభిమానులు అండగా నిలిచారు. ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఓటమి విజయానికి దారులు చూపుతుంది. కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఏది లేదు. నేను ఇష్టపడే ఈ క్రీడకు ప్రతిదీ అంకితం చేశాను. జాతీయ జట్టుతో 20 సంవత్సరాల అనుబంధానికి వీడ్కోలు పలికే సమయం వచ్చింది' అని లిన్ డాన్ ట్వీట్ చేశారు. డబుల్ ఒలింపిక్ స్వర్ణాలతో పాటు లిన్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.

చాలా కాలం ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్‌గా నిలిచిన లిన్ డాన్‌కు 'సూపర్ డాన్' అనే బిరుదు ఉంది. టోక్యో ఒలింపిక్స్‌కు చేరుకోవాలని తాను నిశ్చయించుకున్నానని, కానీ ప్రపంచంలో కరోనా వల్ల క్రీడలను వాయిదా వేయడంతో ఆ కలని అసంభవం చేసిందని లిన్ డాన్ చెప్పారు. టోక్యోలో చివరి ఒలింపిక్స్ ఆడి మూడవ ఒలింపిక్ స్వర్ణం సాధిస్తానని గతంలో చెప్పిన ఈ డాన్.. శనివారం మాత్రం తన శరీరం ఆటకు సహకరించట్లేదని చెప్పారు.

లిన్ డాన్‌ బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో మొత్తం తొమ్మిది ప్రధాన టైటిళ్లను గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌ లిన్‌ కావడం విశేషం. ఒలింపిక్‌ గేమ్స్‌, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌, వరల్డ్‌కప్‌, థామస్‌ కప్‌, సుదీర్మన్‌ కప్‌, సూపర్‌ సిరీస్‌ మాస్టర్స్‌ ఫైనల్స్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌, ఆసియా గేమ్స్‌, ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ ఇలా అన్ని టోర్నీల్లోనూ విజేతగా నిలిచారు. ఛాంపియ‌న్‌ లిన్‌ ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 666 సింగల్స్‌ మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. కేవలం 128 మ్యాచ్‌ల్లోనే ఓటమిని చూశారు. వర్డల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఐదుసార్లు టైటిల్‌ విజేతగా నిలవడం విశేషం.

సామ్ కరన్‌కు కరోనా నెగెటివ్‌.. ఊపిరి పీల్చుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు!!సామ్ కరన్‌కు కరోనా నెగెటివ్‌.. ఊపిరి పీల్చుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు!!

Story first published: Saturday, July 4, 2020, 13:08 [IST]
Other articles published on Jul 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X