న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు

By Nageshwara Rao
Asian Games 2018: Saina, Sindhu sail into quarters, Satwik-Chirag out

హైదరాబాద్: ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు జోరుమీదున్నారు. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వీరిద్దరూ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. సైనా నెహ్వాల్‌ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించింది.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సైనా నెహ్వాల్.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, రెండో గేమ్‌ను 21-14 తేడాతో గెలిచిన సైనా క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ పోరు కేవలం అరగంటలోనే ముగియడం విశేషం. మరో షట్లర్ పీవీ సింధు కూడా క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

ఇండోనేషియాకే చెందిన మరో షట్లర్‌ జార్జియా మారిస్కా తున్‌జంగ్‌పై 21-12, 21-15 పీవీ సింధు విజయం సాధించింది. ఇక, కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సాధించిన సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి జోడీ పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌‌లో ఓటమి పాలైంది. కొరియా జోడీ చోయి సాల్గీ, మిన్‌ హ్యుక్‌ కాంగ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో 17-21, 21-19, 17-21 తేడాతో ఓటమిపాలైంది.

ఇక, ఆర్చరీ రికర్వ్‌ విభాగంలో భారత మహిళల జట్టు కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత జట్టు 2-6 తేడాతో చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓటమి పాలైంది.

Story first published: Saturday, August 25, 2018, 16:37 [IST]
Other articles published on Aug 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X