న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా స్వప్నం అదే: తొలి మహిళా డబుల్స్ టోర్నీ అశ్విని పొన్నప్ప

Ashwini Ponnappa announces first ever womens doubles exclusive tournament

హైదరాబాద్: బ్యాడ్మింటన్‌లో డబుల్స్‌ విభాగానికి ఆదరణ పెరగాలని భారత అగ్రశ్రేణి డబుల్స్‌ షట్లర్‌ అశ్విని పొన్నప్ప అభిప్రాయపడింది. బుధవారం రెడ్‌బుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేశంలోనే తొలి బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌ టోర్నీని ఆమె ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ''దేశంలో డబుల్స్ బ్యాడ్మింటన్‌పై అవగాహన, ప్రాచుర్యం కల్పించడం నా స్వప్నం" అని అన్నారు.

"డబుల్స్ ప్లేయర్స్కు మరిన్ని ఉపాధి అవకాశాలు, టోర్నమెంట్స్లో మరింత పేరు ప్రఖ్యాతులు, సింగిల్స్తో సమానంగా ప్రైజ్ మనీ లభిస్తాయి. ఇవన్నీ కూడా యువతకు డబుల్స్ పై దృష్టి పెట్టేందుకు మరియు దాన్ని ప్రధానంగా తీసు కునేందుకు యువతకు స్ఫూర్తి కలిగిస్తాయి. ఏళ్ళుగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి" అని ఆమె అన్నారు.

యుక్త వయస్సులోనే డబుల్స్‌పై ఫోకస్

యుక్త వయస్సులోనే డబుల్స్‌పై ఫోకస్

"నేడు యువత యుక్త వయస్సులోనే డబుల్స్‌పై ఫోకస్ పెడుతూ, అటుగా మారుతోంది. నేడు మనం ప్రత్యేకించి డబుల్స్ కోసం స్పెషలిస్ట్ కోచ్‌లను కలిగి ఉన్నాం. అది ఈ క్రీడ ప్రమాణాలు పెరిగేందుకు దోహదపడింది. భాగస్వాముల మధ్య అవగాహన పెరిగింది. ఎంతో మంది యువతులు బాల్యం నుంచే డబుల్స్‌ను తీసుకోవడం ఇందుకు ఓ గొప్ప సంకేతం" అని తెలిపారు.

మనం సరైన దిశలోనే పయనిస్తున్నాం

మనం సరైన దిశలోనే పయనిస్తున్నాం

"ఎంతోమంది భారతీయ డబుల్స్ జంటలు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో సెమీ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మనం సరైన దిశలోనే పయనిస్తున్నాం అనేందుకు ఇది ఒక చక్కటి సంకేతం. ఇంకా పయనించాల్సింది ఎంతో ఉంది. నేనెంతగానో కలలు కన్న రెడ్‌బుల్ షటిల్ అప్ కార్యక్రమానికి అండగా నిలుస్తున్నందుకు రెడ్‌బుల్‌కు నా ధన్యవాదాలు" అని పొన్నప్ప తెలిపారు.

కలలను నిజం చేసే అవకాశం

కలలను నిజం చేసే అవకాశం

"వర్ధమాన మహిళా క్రీడాకారిణుల కలలను నిజం చేసే అవకాశాన్ని ఇది అందిస్తుంది. మన దేశంలో విమెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్‌కు సంబంధించి క్రీడలో పాల్గొనడం, ప్రజాదరణ, సపోర్ట్ స్థాయిలను మెరుగుపరిచేందుకు, ఉన్నతీకరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది'' అని అశ్విని పొన్నప్ప ఈ సందర్భంగా అన్నారు.

అక్టోబర్ 5 నుంచి ఈ అర్హత టోర్నీలు ఆరంభం

అక్టోబర్ 5 నుంచి ఈ అర్హత టోర్నీలు ఆరంభం

ఈ టోర్నీ క్వాలిఫయర్స్‌ ఢిల్లీ, బెంగళూరు, గువహటి, హైదరాబాద్‌, ముంబై నగరాల్లో జరుగుతాయి. అక్టోబర్ 5 నుంచి ఈ అర్హత టోర్నీలు ఆరంభం కానున్నాయి. హైదరాబాద్‌లో వచ్చే నెల 14 నుంచి అర్హత టోర్నీ నిర్వహించనున్నారు. 16 ఏళ్ళకు పైబడిన మహిళలు ఈ టోర్నీలో పాల్గొనవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.

 అన్ని మ్యాచులు కూడా నాకౌట్ ప్రాతిపదికన

అన్ని మ్యాచులు కూడా నాకౌట్ ప్రాతిపదికన

అన్ని మ్యాచులు కూడా నాకౌట్ ప్రాతిపదికన జరుగుతాయి. అన్ని జంటలు కూడా సంప్రదాయక 21 పాయింట్ల సెట్ గాకుండా, 11 పాయింట్ల (ర్యాలీ పాయింట్స్) తో బెస్ట్ ఆఫ్ 3 సెట్స్ ఆడాల్సి ఉంటుంది. ప్రతీ జంట కూడా రెఫరీకి ముందస్తు నోటిఫికేషన్‌తో ఒక సెట్‌లో ఒక సారి సూపర్ పాయింట్ కోసం కాల్ చేయవచ్చు.

సూపర్ పాయింట్ కోసం

సూపర్ పాయింట్ కోసం

సూపర్ పాయింట్ కోసం కాల్ చేయడం ద్వారా ఆ జంట, ఆ ని ర్దిష్ట పాయింట్ వద్ద గెలుపొందితే, 2 పాయింట్లు పొందుతారు. ఆ జంట గనుక ఆ పాయింట్‌ను కోల్పోతే, పాయింట్ల తగ్గింపు ఏమీ ఉండదు. పాల్గొనే వారంతా కూడా రోజులో 5/6 మ్యాచులు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. 6 జంటలు నేషనల్ ఫైనల్స్ (నవంబర్ మొదటి వారం)కు అర్హత పొందుతాయి.

 ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ

ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ

అంటే, ప్రతీ నగరం నుంచి ఒక్కో టి (5 నగరాలు), 1 లక్కీ లూజింగ్ జంట. లక్కీ లూజర్ జంటే అంటే, ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ, ఆ మ్యాచ్‌లో గరిష్ఠ సంఖ్యలో పాయింట్లు గెలుపొందిన జట్టు. ఒకవేళ 2 జంటలు గనుక సమాన సంఖ్యలో పాయింట్లు సాధిస్తే, అంతకు ముందు రౌండ్ పరిగణనలోకి తీసుకోబడుతుందని టోర్నీ నిర్వహకులు తెలిపారు.

Story first published: Thursday, September 27, 2018, 15:54 [IST]
Other articles published on Sep 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X