For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరంభం అదిరింది; బెంగళూరు ఓపెన్‌లో యుకీ శుభారంభం

By Nageshwara Rao
Yuki Bhambri overcomes groin strain to oust Sriram Balaji, Ramkumar fights back

హైదరాబాద్: బెంగళూరు ఓపెన్‌లో భారత ఆటగాడు యుకీ భాంబ్రీ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో స్వదేశానికి చెందిన శ్రీరాం బాలాజీపై 6-3, 6-2తో విజయం సాధించాడు. గత వారం పుణె ఓపెన్‌ టైటిల్‌ గెలిచి మంచి ఊపుమీదన్న యుకీ భాంబ్రీ అద్భుతమైన ఆటతీరుని కనబర్చాడు.

మూడో సీడ్‌గా బరిలోకి దిగిన యుకీ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుని ప్రదర్శించాడు. బాలాజీ చేసిన రెండు డబుల్ ఫాల్ట్స్‌ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ టోర్నీలోకి బాలాజీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం 122వ ర్యాంకులో ఉన్న యుకీ గత వారం జరిగిన పుణె ఫైనల్లో రాంకుమార్‌ రామనాథన్‌ను ఓడించి ఈ ఏడాది ఏటీపీ టూర్‌లో తొలి టైటిల్‌ సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది ఆరంభంలో 474వ ర్యాంక్‌లో ఉన్న యుకీ ఫ్రెంచి ఆటగాడు గేల్‌ మోన్‌ఫిల్స్‌, డెనిస్‌ షపొవలొవ్‌లపై గెలుపొంది ర్యాంకుని మెరుగుపరచుకున్నాడు.

ఇదిలా ఉంటే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ విష్ణువర్ధన్‌ 3-6, 3-6తో మారియో విలెల్ల మార్టినెజ్‌ చేతిలో, సూరజ్‌ 4-6, 6-7తో ఇలియాస్‌ ఎమర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, బెంగళూరు ఓపెన్ టైటిల్‌ పోరులో ఉన్న సాకేత్‌ మైనేని కుడి భుజం గాయంతో టోర్నీనుంచి తప్పుకున్నాడు.

Results
Round 1 Singles
1-Blaz Kavcic (SLO) bt Tomislav Brkic (BIH) 6-2, 6-7 (0), 7-6 (6); Q-Borna Gojo (CRO) bt 2-Adrian Menendez-Maceiras (ESP) 6-3, 1-6, 7-5; Suraj Prabodh (IND) lost to 4-Elias Ymer (SWE) 4-6, 6-7 (2); Kaichi Uchida (JPN) lost to Ante Pavcic 3-6, 4-6; Aleksandr Nedovyesov (KAZ) bt Matej Sabanov (CRO) 6-4, 6-1; Tsung-Hua Yang (TPE) bt Bernabe Zapata Miralles (ESP) 7-6 (1), 3-0 (retd); WC-Vishnu Vardhan (IND) lost to Mario Vilella Martinez (ESP) 3-6, 3-6; Naoki Nagakawa (JPN) lost to Pedro Martinez (ESP) 7-6 (5), 6-3; Ramkumar Ramanathan (IND) bt Hugo Grenier (FRA) 4-6, 6-4, 6-3; Dalwinder Singh (IND) lost to Antoine Escoffier (FRA) (LL) 6-3, 6-4.

డబుల్స్‌లో ప్రాంజల జోడీ బోణీ
డబ్ల్యూటీఏ ముంబై ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో ఆరంభ రౌండ్‌లో ప్రాంజల-కర్మన్‌ కౌర్‌ జోడీ 6-3, 7-5తో వరుస సెట్లలో నిక్తా గెయిన్స్‌ (ఆస్ర్టేలియా)-ఫన్నీ స్టోలర్‌ (హంగేరి) జోడీపై విజయం సాధించింది.

Doubles
Timur Kabibulin (KAZ)/Alexandr Nedovyesov (KAZ) bt 4- Scott Clayton (GBR)/Jonny O'Mara (GBR) 6-4, 4-6, 10-7; 1-Mikhail Elgin (RUS)/Divij Sharan (IND) bt Geoffrey Blancaneaux (FRA)/Jay Clarke (GBR) 5-7, 6-4, 10-5; Sumit Nagal (IND)/Elias Ymer (SWE) bt Jeevan Nedunchezhiyan (IND)/N Vijay Sundar Prashanth (IND) 6-4, 1-6, 10-7

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 22, 2017, 10:59 [IST]
Other articles published on Nov 22, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+