న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నారి అభిమాని వింత కోరిక, వెంటనే స్పందించిన ఫెదరర్(వీడియో)

Young tennis fan charms Federer with headband request

హైదరాబాద్: బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్‌ను చిన్నారి అభిమాని వింత కోరిక కోరింది. తలకు పెట్టుకునే బ్యాండ్ కావాలంటూ అడగడంతో ఫెదరర్.. చూసిన వెంటనే స్పందించి దానిని ఆమెకు అందజేశాడు. మిహికా జోషి (13) అనే చిన్నారి సోమవారం ఫెదరర్ ఆడనున్న మ్యాచ్ కోసం శనివారమే కాచుకుని కూర్చొందట.

'ఇలా నా కల నిజమైంది. నిజంగా ఆశ్చర్యానికి గురైయ్యాను. ఫెదరర్ ఆడే మైదానానికి దగ్గర్లోనే మాకు సీట్లు దొరికాయి. మ్యాచ్ అయిపోయేంత వరకూ ఎదురుచూశాను. తొలి రౌండ్లో విజేతగా నిలిచిన తర్వాత అందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నాడు. గుంపులో ఉండి అతనికి కనిపించేలా ప్లకార్డు పట్టుకుని నిల్చొవడంతో దానికి స్పందించాడు.'

ఈ మ్యాచ్ టిక్కెట్లు పొందేందుకు శనివారం ఉదయం నుంచి క్యూలో ఉండాల్సి వచ్చింది. ఎనిమిదేళ్ల వయస్సులో 2013వ సంవత్సరం నుంచి ఫెదరర్ అన్ని మ్యాచ్‌లను చూస్తున్నాను.' అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లి అభిజీత్ జోషీ మాట్లాడుతూ.. 'మిహికా టెన్నిస్ చాలా బాగా ఆడుతుంది. వారానికి ఆరు రోజులు టెన్నిస్ ఆడుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆమె కూడా వింబుల్డన్ కచ్చితంగా ఆడి తీరుతుంది.' అని ఆశాభావం వ్యక్తం చేశారు.

వరల్డ్ కప్ టెన్నిస్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సోమవారం జరిగిన మొదటి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ ఫెదరర్‌ 6-1, 6-3, 6-4తో లజోవిచ్‌ (క్రొయేషియా)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఏస్‌లు కొట్టిన రోజర్‌.. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. సెర్బియా క్రీడాకారుడు, మాజీ వరల్డ్ నెంబర్ 57 డసన్ లజోవిక్‌ను 61, 6-3, 6-4 తేడాతో 79 నిమిషాల్లో ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

ఫెదరర్ వింబుల్డన్ టోర్నీ మొదటి రౌండ్‌లో గెలుపొందడం ఇది 20వ సారి. ఒక సెర్బియా క్రీడాకారుడిని వింబుల్డన్‌లో ఫెదరర్ రెండోసారి ఓడించాడు. ఈ సందర్భంగా ఫెదరర్ మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యాచ్ ప్రారంభంలో తాను కొంత ఇబ్బంది పడ్డానని, తర్వాత పుంజుకుని విజయం సాధించానని అన్నాడు. ఫెదరర్ రెండోరౌండ్‌లో స్లవాకియాకు చెందిన లుకాస్ లకావో లేదా ఫ్రెంచ్ బెంజమిన్ బోంజీతో తలపడతాడు.

Story first published: Wednesday, July 4, 2018, 17:58 [IST]
Other articles published on Jul 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X