డేవిస్ కప్ పోరుకు సై అంటోన్న పేస్

Posted By:
World record beckons Paes in Davis Cup tie against China

హైదరాబాద్: భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ ముంగిట సువర్ణావకాశం. చైనాతో శుక్రవారం జరుగనున్న డేవి్‌సకప్‌ పోరులో డబుల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా లియాండర్‌ పేస్‌ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవు తున్నాడు.

44 ఏళ్ల పేస్‌ ఇప్పటివరకు డేవి‌సకప్‌ డబుల్స్‌ విభాగంలో 42 విజయాలతో ఇటలీ ఆటగాడు నికోలా పీట్రాంజెలితో సమంగా ఉన్నాడు. చైనాతో పోరు లో డబుల్స్‌లో విజయం సాధిస్తే ప్రపంచ రికార్డు పేస్‌ వశమౌతుంది. తొలి రోజు సింగిల్స్‌ విభాగంలో వీ బింగ్‌తో రామ్‌కుమార్‌, జీ జాంగ్‌తో సుమిత్‌ ఆడతారు.

రెండో రోజు శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో పేస్‌-బోపన్న జంట డి వూ-మావొ జిన్‌ గాంగ్‌ జోడీతో ఆడనుంది. డబుల్స్‌ మ్యాచ్‌ తర్వాత రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్‌ విభాగం లో డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుడిగా రికార్డులకెక్కడానికి భారత దిగ్గజం లియాండర్‌ పేస్‌ మరో విజయం దూరంలో ఉన్నాడు. డబుల్స్‌లో బోపన్నతో అతను బరిలో దిగే అవకాశం ఉంది.

భారత్‌ చైనాల పోరును నూతన విధానంలో బెస్టాఫ్‌ త్రీ సెట్ల పద్ధతిలో రెండు రోజులలో నిర్వహించనున్నారు. తొలి రోజు సింగిల్స్‌ పోటీలు, రెండో రోజు డబుల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌ పోటీలు జరుగనున్నాయి.

Story first published: Friday, April 6, 2018, 10:20 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి