న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముగురుజాకు షాక్‌: వింబుల్డన్‌లో సెరెనా, జ్వెరెవ్‌, ఫెదరర్‌ ముందంజ

By Nageshwara Rao
Wimbledon: Serena battles past gutsy Mladenovic; Venus and Keys join seed exodus

హైదరాబాద్: వింబుల్డన్‌లో శుక్రవారం సంచలనాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ముగురుజా (స్పెయిన్‌) సహా నలుగురు టాప్ క్రీడాకారిణులు టోర్నీ నుంచి నిష్క్రమించారు. తాజాగా మహిళల సింగిల్స్‌ రెండోరౌండ్లో మూడోసీడ్‌ ముగురుజా 7-5, 6-2, 6-1తేడాతో అన్‌సీడెడ్‌ అలిసన్‌ (బెల్జియం) చేతిలో ఓటమిపాలైంది.

 వింబుల్డన్‌లో ముగురుజా ఓటమి

వింబుల్డన్‌లో ముగురుజా ఓటమి

తొలిసెట్‌ కోల్పోయినా అలిసన్‌ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. మిగతా రెండుసెట్లలో ముగురుజాను కేవలం మూడుగేమ్‌లకే పరిమితం చేసి తొలిసారి మూడోరౌండ్‌కు దూసుకెళ్లింది. 23 అనవసర తప్పిదాలకు పాల్పడిన ముగురుజా ఓటమి కొనితెచ్చుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో అమెరికాకు చెందిన వీనస్‌ విలియమ్స్‌, మాడిసన్‌ కీస్‌ కూడా ఓడిపోయారు.

 ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన వీనస్

ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన వీనస్

వీనస్‌ మూడో రౌండ్లో 2-6, 7-6 (7-5), 6-8తో బెర్టెన్స్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (యుఎస్‌) కూడా మూడో రౌండ్లో 5-7, 7-5, 4-6తో రోడినా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు మాజీ నంబర్‌వన్‌ సెరెనా తన జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్లో సెరెనా 7-5, 7-6 (7-2)తో క్రిస్టినా (ఫ్రాన్స్‌)పై నెగ్గింది.

ప్రిక్వార్టర్స్‌కు చేరిన ఫెదరర్

ప్రిక్వార్టర్స్‌కు చేరిన ఫెదరర్

మరో మ్యాచ్‌లో రుమేనియా అమ్మాయి మిహేల బుజారానెస్కు 6-3, 6-2తో ఏడోసీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌)పై నెగ్గి ప్రీక్వార్టర్స్‌కు చేరింది. దీంతో టాప్‌-10 క్రీడాకారిణుల్లో టాప్‌ సీడ్‌ హలెప్‌ మాత్రమే బరిలో మిగిలింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) 6-3, 7-5, 6-2తో స్ట్రఫ్‌ (జర్మనీ)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నాడు.

గాయంతో మ్యాచ్‌ మధ్యలో తప్పుకున్న బోపన్న

గాయంతో మ్యాచ్‌ మధ్యలో తప్పుకున్న బోపన్న

నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో జ్వెరెవ్‌ 6-4, 5-7, 6-7 (0-7), 6-1, 6-2తో టేలర్‌ (యుఎస్‌)పై విజయం సాధించాడు. ఇక, వింబుల్డన్‌లో భారత డబుల్స్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న కథ ముగిసింది. గాయం కారణంగా బోపన్న మ్యాచ్‌ మధ్యలో తప్పుకున్నాడు. పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్లో ఫ్రెడిరిక్‌- సాలిస్‌బరి జంటతో తలపడిన బోపన్న- ఎడ్వర్డ్‌ (ఫ్రాన్స్‌) జోడీ 4-6, 6-7 (4-7), 1-2తో వెనకబడి ఉన్న సమయంలో బోపన్న గాయంతో తప్పుకున్నాడు.

Story first published: Saturday, July 7, 2018, 10:42 [IST]
Other articles published on Jul 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X