న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా ఓపెన్‌కు సర్వం సిద్ధం: అజరెంకాకు వైల్డ్ కార్డ్

Victoria Azarenka granted wildcard for Australian Open

హైదరాబాద్: విక్టోరియా అజరెంకా ఈ పేరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. దేనికంటే టెన్నిస్ రంగంలో రెండేళ్లు వరుసగా 2012, 2013లలో ప్రపంచ స్థాయిలో మొట్ట మొదటి స్థానంలో నిలిచింది. అజరెంకా కొన్నేళ్ల పాటు టెన్నిస్ రంగం నుంచి విరామం తీసుకుంది. అయితే మళ్లీ అదే స్థాయిలో తన ప్రతిభని నిరూపించుకోవాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో తను ఆస్ట్రేలియా ఓపెన్‌ థర్డ్ టైటిల్ గెలుచుకునేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుబెట్టింది.

మెల్బౌర్న్ వేదికగా జరిగిన మహిళల విభాగంలో 2012, 2013 సంవత్సరాలకు గాను వరుసగా అజరెంకా విజేతగా నిలిచింది. ఇదే వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌ డ్రా అయింది. దీంతో 2018 మహిళల సింగిల్స్ విభాగంలో ఆడేందుకు అర్హత పొందింది. ఈ ఏడాది అజరెంకా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవగా రెండింటిని ఆడలేకపోయింది. అమెరికా ఓపెన్, ఫెడ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లను మిస్ అయింది.

'నేను చాలా ఉద్వేగంగా ఉన్నాను. మళ్లీ మెల్బౌర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది నా ఫేవరేట్ టోర్నమెంట్' అని అభిప్రాయపడింది. ఇంకా రాబోయే సంవత్సరం శుభారంభం కావాలని ఆశపడుతున్నానని తెలిపింది.

ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ డైరక్టర్ క్రైగ్ టిలే మాట్లాడుతూ.. ప్రస్తుత ఏడాది అజరెంకాకు చాలా క్లిష్టంగా గడిచిందన్నారు. అయినా అవకాశం కల్పించే దిశగా రెండు సార్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీని కల్పించామని అన్నాడు. 2016లో 28 ఏళ్ల ఈ బెలారష్యన్ తల్లి అయింది. అయితే ఇదే నేపథ్యంలో డిసెంబరు 2016లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌ను మిస్ అయింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 13, 2017, 12:03 [IST]
Other articles published on Dec 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X