41 అనవసర తప్పిదాలు: సెరీనాపై నెగ్గిన వీనస్

Posted By:
Venus beats Serena at Indian Wells

హైదరాబాద్: బీఎన్‌పీ పారిబాస్ ఓపెన్ టోర్నీలో సెరీనా విలియమ్స్‌పై అక్క వీనస్ విలియమ్స్ గెలిచింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో వీనస్ విలియమ్స్ 6-3, 6-4 స్కోర్‌తో మూడవ రౌండ్‌లో సెరీనాపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో సెరీనా 41 అనవసర తప్పిదాలకు పాల్పడి మ్యాచ్‌ని పొగొట్టుకుంది.

సుమారు గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో వీనస్ విజయం సాధించింది. 2014 తర్వాత సెరెనాపై వీనస్ నెగ్గడం ఇదే తొలిసారి. 1998 ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీరిద్దరూ ముఖాముఖి పోరులో తొలిసారి తలపడగా, 16 ఏళ్ల సెరెనా విలియన్స్‌ను 17 ఏళ్ల వీనస్ విలియమ్స్ ఓడించింది.

వీరిద్దరి మధ్య ఇప్పటివరకూ జరిగిన 28 మ్యాచ్‌ల్లో సెరెనా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వీనస్‌ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందారు. అక్కా చెల్లెల్ల మధ్య జరిగిన గత తొమ్మిది మ్యాచ్‌లకు గాను ఎనిమిది మ్యాచ్‌ల్లో సెరెనా విజయం సాధించింది.

ఈ టోర్నీలో 36 ఏళ్ల సెరెనా విలియన్స్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగగా, 37 ఏళ్ల వీనస్ విలియమ్స్ ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగింది. టోర్నీలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సెరెనా విజయం సాధించగా, వీనస్‌కు మాత్రం ఫస్ట్ రౌండ్ బై కాగా, ఓపెనింగ్ మ్యాచ్‌లో విజయం సాధించింది.

కాగా, గతేడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో వీనస్‌ను ఓడించిన సెరెనా తన కెరీర్‌లో 23వ గ్రాండ్ స్లామ్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, March 13, 2018, 11:51 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి