న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్‌ ఓపెన్‌లో సంచలనం: చరిత్ర సృష్టించిన ఒసాకా, రాకెట్‌ విసిరేసిన సెరెనా

By Nageshwara Rao
US Open Final: Osaka makes history amid extraordinary Serena umpire row

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ ఫైనల్లో పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఓడించి టైటిల్‌ విజేతగా అవతరించింది. తద్వారా యుఎస్ ఓపెన్ గెలిచిన జపనీస్‌ క్రీడాకారిణిగా ఒసాకా చరిత్ర సృష్టించింది.

టెన్నిస్‌లో ఆటలో పీహెచ్‌డీ చేసిన సెరెనాను... ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న ఒసాకా ఓడించడంతో యావత్ టెన్నిస్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. యుఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఒసాకా 6-2,6-4 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఒసాకా గెలవడం ఇదే తొలిసారి.

తొలి జపనీస్‌ మహిళగా ఒసాకా రికార్డు

తొలి జపనీస్‌ మహిళగా ఒసాకా రికార్డు

దీంతో గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన తొలి జపనీస్‌ మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఒసాకా 3.8 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. జపాన్ పురుష ఆటగాళ్లు కూడా ఈ ఘనత సాధించలేక పోవడం విశేషం. ఫైనల్ పోరు రెండో సెట్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా

ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్‌పై.. తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న ఒసాకా అలవోక విజయాన్ని నమోదు చేసింది. దీంతో 24 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకొని ఆస్ట్రేలియా మాజీ టెన్నిస్ దిగ్గజం మార్గెరెట్ కోర్ట్ సరసన నిలవాలన్న సెరెనా కల నెరవేరకుండా పోయింది. మరోవైపు సెరెనా తీరు ఈ మ్యాచ్‌లో వివాదాస్పదమైంది.

రాకెట్‌ విసిరేసిన సెరెనా..

రాకెట్‌ విసిరేసిన సెరెనా..

తొలి సెట్‌ను 6-2 కోల్పోయిన సెరెనా.. రెండో సెట్‌ జరుగుతున్న సమయంలో కోచ్‌ సాయం తీసుకోవడంపై ఛైర్‌ అంపైర్‌ హెచ్చరించాడు. దీంతో ఛైర్ అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన సెరెనా ఆగ్రహంతో రాకెట్‌ను నేలకేసి కొట్టడంతో పాటు అంఫైర్ ను దొంగ అని పిలిచి వివాదంలో చిక్కుకుంది. దీంతో ఛైర్‌ అంపైర్‌ ఆమెకు ఒక పాయింట్‌ జరిమానా విధించాడు.

మార్గెరెట్ కోర్ట్ రికార్డుని సమం చేయలేకపోయిన సెరెనా

మార్గెరెట్ కోర్ట్ రికార్డుని సమం చేయలేకపోయిన సెరెనా

అనంతరం సెరెనా రెండో సెట్‌ను కూడా కోల్పోవడంతో ఒసాకా టైటిల్‌ విజేతగా నిలిచింది. గత ఏడాది బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం సెరెనా విలియమ్స్ ఆడిన రెండో అతిపెద్ద గ్రాండ్ స్లామ్ ఇదే. ఈ ఏడాది మొదట్లో జరిగిన వింబుల్డన్ టోర్నీలో సెరెనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌ గెలిచి ఉంటే సెరెనా ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేరి ఉండేది.

Story first published: Sunday, September 9, 2018, 11:13 [IST]
Other articles published on Sep 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X