న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోర్టులోనే షర్ట్ మార్చిన కార్నెట్: అంఫైర్ మందలింపు, క్షమాపణ చెప్పిన నిర్వాహకులు

By Nageshwara Rao
US Open apologises after Alizé Cornet penalised for briefly removing shirt

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్‌ కోర్టులో దుస్తులు మార్చుకోవడాన్ని ఛైర్‌ అంపైర్‌ తప్పుబట్టడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. కార్నెట్, జొహన్నా లార్సన్ (స్వీడన్) మధ్య మ్యాచ్ జరిగే సమయంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం 10 నిమిషాలు విరామాన్ని ప్రకటించారు.

ఆ విరామంలో కార్నెట్ ఏం జరిగిందంటే.. తొలిమ్యాచ్‌లో కార్నెట్ తన టాప్‌ను సరిగా ధరించలేదు. వెనుక భాగం ముందుకు వచ్చేలా ధరించడంతో కార్నెట్ బాయ్‌ఫ్రెండ్ ఆ విషయాన్ని తనకు సైగ ద్వారా చెప్పాడు. యుఎస్‌ ఓపెన్‌లో వేడి విపరీతంగా ఉండడంతో నిర్వాహకులు.. అమ్మాయిలకు మూడో సెట్‌కు ముందు, అబ్బాయిలకు నాలుగో సెట్‌కు ముందు పది నిమిషాలు విరామం ఇచ్చారు.

స్పోర్ట్స్ బ్రా కెమెరాల్లో

దీంతో విరామ సమయంలో కోర్టులోనే పక్కకు వెళ్లి టాప్‌ను విప్పి మళ్లీ సరిగ్గా వేసుకుంది. ఈ క్రమంలో ఆమె లోపల వేసుకున్న స్పోర్ట్స్ బ్రా కెమెరాల్లో కనిపించింది. వెంటనే దీన్ని గుర్తించిన చైర్ అంపైర్.. కార్నెట్ క్రీడా నిబంధనలను ఉల్లంఘించిందని హెచ్చరించారు. దీంతోనే అసలు వివాదం మొదలైంది.

మహిళల విషయంలో ఎందుకు వస్తున్నాయి

పురుషులు కోర్టులోనే టీషర్టులు మార్చుకుంటున్నప్పుడు అడ్డురాని నిబంధనలు మహిళల విషయంలో ఎందుకు వస్తున్నాయని టెన్నిస్‌ మాజీ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె కోర్టులో షర్ట్‌ మార్చుకున‍్నప్పటికీ, ఎవరికీ ఇబ్బంది కలగలేనప్పుడు రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచారు.

ఉద్దేశపూర్వకంగా కాదు కదా

ఉక్కపోతతో కార్నెట్‌ అలా చేసిందే కానీ.. ఉద్దేశపూర్వకంగా కాదు కదా అంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా మండిపడుతున్నారు. వాస్తవానికి డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం క్రీడాకారిణులు కోర్టులో దుస్తులు మార్చుకోకూడదు. పురుషుల విషయంలో మాత్రం ఇలాంటి నిబంధనేమీ లేదు.

అనుకూలంగా నెటిజన్లు

దీనిపై సోషల్ మీడియాలో కార్నెట్‌కు అనుకూలంగా నెటిజన్లు స్పందించడంతో యుఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు రంగంలోకి దిగారు. కార్నెట్‌ను.. ఛైర్‌ అంపైర్‌ హెచ్చరించకుండా ఉండాల్సిందంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో కార్నెట్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని పేర్కొన్నారు.

Story first published: Friday, August 31, 2018, 13:18 [IST]
Other articles published on Aug 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X