న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తప్పతాగి ప్రాక్టీస్ మ్యాచ్ ఎగ్గొట్టాడు: జట్టు నుంచి తొలగింపు

త‌ప్ప‌తాగి హ్యాంగోవ‌ర్ కావడంతో మార్నింగ్ ప్రాక్టీసు సెషన్స్‌ను ఎగ్గొట్టిన 19 ఏళ్ల సుమిత్ నాగల్‌ను డేవిస్ కప్ జట్టు నుంచి తొలగించారు. సుమిత్ నాగల్ ఇప్పుడిప్పుడే ప్రొఫెషనల్ టెన్నిస్ వైపు అడుగులు వేస్తున

By Nageshwara Rao

హైదరాబాద్: త‌ప్ప‌తాగి హ్యాంగోవ‌ర్ కావడంతో మార్నింగ్ ప్రాక్టీసు సెషన్స్‌ను ఎగ్గొట్టిన 19 ఏళ్ల సుమిత్ నాగల్‌ను డేవిస్ కప్ జట్టు నుంచి తొలగించారు. సుమిత్ నాగల్ ఇప్పుడిప్పుడే ప్రొఫెషనల్ టెన్నిస్ వైపు అడుగులు వేస్తున్నాడు. హ్యాంగోవ‌ర్ కారణంగా ప్రాక్టీస్‌ను ఎగ్గొట్టడాన్ని తీవ్ర‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న‌గా భావించి డేవిస్ క‌ప్ జట్టు నుంచి తొల‌గించినట్లు ఏఐటీఏ వర్గాలు వెల్లడించాయి.

గ‌తేడాది జులైలో కొరియాతో జ‌రిగిన డేవిస్‌క‌ప్‌లో మ్యాచ్‌లో సుమిత్ నాగల్ రిజ‌ర్వ్‌ప్లేయ‌ర్‌గా ఉన్నాడు. అయితే ఉద‌యం పూట జ‌రిగే ప్రాక్టీస్ సెష‌న్‌కు హాజరు కాలేదు. దీనికి కారణం ఏంటని ఏఐటీఏ ఆరా తీయగా హ్యాంగోవ‌ర్ అని తేలింది. 'హోటల్ రూమ్‌లో ఉన్న మినీ బార్‌లో అతడు తప్ప తాగినట్లు తెలిసింది. అతడు చాలా తెలివైనవాడు.

 Sumit Nagal dropped from India's Davis Cup squad due to serious breach of discipline: AITA sources

19 ఏళ్ల వయసులోనే భారత జట్టులో ఆడే అవకాశాన్ని పొందాడు. అయితే హ్యాంగోవ‌ర్ కారణంగా ప్రాక్టీస్‌ను ఎగ్గొట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం' అని ఏఐటీఏ అధికారి అన్నారు. 2015లో వింబుల్డ‌న్ జూనియ‌ర్ డ‌బుల్స్ టైటిల్ గెలిచిన సుమిత్‌ స్పెయిన్‌తో డేవిస్ క‌ప్ మ్యాచ్ సంద‌ర్భంగా అనుమ‌తి లేకుండా త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను స్పెయిన్‌కు తీసుకొచ్చాడు.

ఆమెను వెంట‌నే వెన‌క్కి పంపించేయాల‌ని కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ సీరియ‌స్‌ వార్నింగ్ ఇచ్చాడు. గతేడాది జులైలో జరిగిన సంఘటనకు ఇప్పుడు శిక్ష విధించడం ఏంటని ఆ అధికారిని ప్ర‌శ్నించ‌గా ఈ విష‌యం ఆల‌స్యంగా తెలిసింద‌ని చెప్పారు. స్పెయిన్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా నాగల్‌ను ఇదే విష‌య‌మై ప్ర‌శ్నించ‌గా అలాంటిదేమీ లేద‌ని చెప్ప‌డంతో మేము న‌మ్మామని, ఆ తర్వాత అతడిపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో చ‌ర్య తీసుకోక త‌ప్ప‌లేద‌ని ఆ అధికారి చెప్పారు.

ఈ కారణాలను పరిగనలోకి తీసుకొని ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగే డేవిస్‌కప్‌ జట్టు నుంచి సుమిత్‌ను తొలగించారు. ఇదిలా ఉంటే సుమిత్ నాగ‌ల్ పేరును ప్ర‌తిపాదించిన సీనియ‌ర్ ఆటగాడు మ‌హేష్ భూప‌తి ఈ ఘ‌ట‌న‌పై స్పందించ‌డానికి నిరాక‌రించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X