న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒలింపిక్స్ నుండి పేస్ - విష్ణు జోడీ నిష్క్రమణ

By Nageswara Rao
Leander Paes and Vishnu Vardhan
లండన్, ఆగస్టు 2: లండన్ ఒలింపిక్స్ నుండి భారత టెన్నిస్ డబుల్స్ క్రీడాకారులు లియాండర్ పేస్ - విష్ణువర్దన్ జోడి నిష్ర్కమించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన రెండో సీడ్ జంట సోంగా-మైకేల్ లోద్రాపై 6-7, 4-6, 3-6 తేడాతో పేస్ జోడీ ఓడిపోయింది. హోరా హోరీగా సాగిన తొలి సెట్‌లో పేస్ - విష్ణు జోడీ కాస్త మెరుగ్గా రాణించినప్పటికీ.. మూడు సెట్లలో మ్యాచ్ ఫలితం తారుమారైంది.

ఆటలో ఒకానొక దశలో ఎవరూ సర్వీస్ కోల్పోకపోవడంతో సెట్ టైబ్రేకర్‌కు దారి తీసింది. ఇందులో సోంగా, లోద్రా జంట నెగ్గింది. రెండో సెట్‌ను పేస్ - విష్ణు జోడీ గెల్చుకున్నా... కీలకమైన మూడో సెట్‌లో మాత్రం బ్రేక్ పాయింట్ ఇచ్చి మ్యాచ్ ఓడిపోయింది. అంతక ముందు పురుషులు డబుల్స్ విభాగంలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన మహేశ్ భూపతి - రోహన్ బోపన్న జోడీ ఫ్రాన్స్ అన్ సీడెడ్ జోడీ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

ఫ్రాన్స్ ఆటగాళ్లైన గాస్కె - బెన్నెటె చేతిలో 6-3, 6-4 తేడాతో మహేశ్ - రోహన్‌లను చిత్తుగా ఓడిపోయారు. మొత్తం 77 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్‌లో రెండు సార్లు బ్రేక్ సాధించిన ఫ్రాన్స్ 4-1 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత జోడి రెండు పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 5-3కు తగ్గించారు. అయితే చివరి గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకున్న ఫ్రాన్స్ 6-3తో సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్‌లో తేరుకున్న భూపతి-బోపన్న వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ఫ్రాన్స్ జోడీ పుంజుకుని సెట్, మ్యాచ్ గెలుచుకుంది.

ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో పేస్, సానియా ఆట మాత్రమే మిగిలింది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X