ఇండియన్‌ వెల్స్‌: తల్లిగా తొలి విజయాన్ని నమోదు చేసిన సెరెనా

Posted By:
Serena Williams wins at Indian Wells in first WTA Tour match in 14 months

హైదరాబాద్: అమెరికా టెన్నిస్ స్టార్ ప్లేయర్, ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ తల్లిగా చచ్చిబతకడమే కాదు. టెన్నిస్‌లోనూ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇదే తొలి మ్యాచ్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇండియన్‌ వెల్స్‌లో జరుగుతోన్న డబ్ల్యూటీఏ ఈవెంట్‌లో పాల్గొన్న సెరెనా తొలి రౌండ్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.

 గర్భం దాల్చడంతో కోర్టుకు దూరంగా

గర్భం దాల్చడంతో కోర్టుకు దూరంగా

గత ఏడాది ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన సెరెనా.. గర్భం దాల్చడంతో టెన్నిస్‌ కోర్టుకు దూరంగా గడిపింది. సెప్టెంబరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సెరెనా ఆ తర్వాత కొద్ది రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసింది.

పెళ్లి తర్వాత తొలి ఓటమి

పెళ్లి తర్వాత తొలి ఓటమి

ఎట్టకేలకు కోలుకుని ప్రియుడు అలెక్సిస్‌ ఓహియాన్‌ను పెళ్లి చేసుకుంది. తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్‌ను తిరిగి కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 2017 డిసెంబరులో తిరిగి కోర్టులోకి అడుగుపెట్టింది. ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడిన సెరెనా ఓటమి పాలైంది.

డబుల్స్‌లోనూ పరాజయం తప్పలేదు

డబుల్స్‌లోనూ పరాజయం తప్పలేదు

అయినా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరింత కసిగా ప్రాక్టీస్‌ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో డేవిస్‌ కప్‌ కోసం అక్క వీనస్‌తో కలిసి డబుల్స్‌లో ఆడింది. ఇందులోనూ పరాజయం తప్పలేదు. అయినా తన పోరాటాన్ని ఆపలేదు. తిరిగి పుంజుకుని సాధన చేసిన ఆమె ఇండియన్‌ వెల్స్‌లో డబ్ల్యూటీఏ ఈవెంట్‌లో పాల్గొంది.

హోరాహోరీగా జరిగిన పోరులో

హోరాహోరీగా జరిగిన పోరులో

టోర్నీలో భాగంగా గురువారం రాత్రి కోర్టులో అడుగుపెట్టింది. గ్యాలరీలో కూర్చుని ఉన్న ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో సెరెనాకు స్వాగతం పలికారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. హోరాహోరీగా జరిగిన పోరులో సెరెనా 7-5, 6-3 తేడాతో కజకిస్థాన్‌ క్రీడాకారిణి జరీనా దియాస్‌పై విజయం సాధించింది.

 సోదరి వీనస్‌తో తలపడే అవకాశం

సోదరి వీనస్‌తో తలపడే అవకాశం

జీవితంలో మాతృత్వపు ఆనందాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్న సెరెనా విలియమ్స్‌కు ఇదే తొలి గెలుపు. రెండో రౌండ్లో సెరెనా.. కికి బెర్టన్స్‌తో తలపడనుంది. ఒకవేళ రెండో రౌండ్లో సెరెనా విజయం సాధిస్తే మూడో రౌండ్లో ఆమె సోదరి వీనస్‌తో తలపడే అవకాశం ఉంది.

Story first published: Friday, March 9, 2018, 19:29 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి