న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనను ఏడిపించనందుకే సెరెనా నేనంటే మండిపడుతోంది: షరపోవా

Serena Williams blasts Maria Sharapova over book ‘hearsay’ as showdown looms

హైదరాబాద్: మహిళా టెన్నిస్‌లో సెరెనా విలియమ్స్, మారియా షరపోవా మ్యాచ్‌లలో ఉండే మజా ఇంకే మ్యాచ్‌లలోనూ ఉండదు. కోర్టులోనే కాదు కోర్టు బయట కూడా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్‌లో ఈ జంట మరోసారి తలపడబోతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. షరపోవా సోషల్ మీడియా వేదికగా అన్‌స్టాపబుల్‌లో చెప్పిన విషయాలు చూసి సెరెనాకు మండిపోయింది.

ఇవన్నీ అబద్ధాలేనని సెరెనా చెప్పుకొస్తుంది. 2004 వింబుల్డన్ ఫైనల్లో సెరెనాను ఓడించి టైటిల్ గెలిచింది షరపోవా. ఆ మ్యాచ్ తర్వాత సెరెనా కంటతడి పెట్టింది. అప్పటి నుంచి ఆమె తనను ద్వేషిస్తుందని ఈ బుక్‌లో షరపోవా వెల్లడించింది. వీటిపై సెరెనా తీవ్రంగా స్పందించింది. ఆ బుక్‌లో రాసిందంతా వదంతులే. చాలా అసంతృప్తికి గురయ్యాను, ఆ మ్యాచ్ తర్వాత లాకర్ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాను. అది సహజమే. చాలా మంది చేసేదే. అందులోనే అది వింబుల్డన్ ఫైనల్. అలాంటి మ్యాచ్‌లో ఓడితే ఎవరు మాత్రం ఏడవకుండా ఉంటారు. షరపోవా తన బుక్‌లో నా గురించే ఎక్కువగా రాసింది. అది నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చాలా బాధ కలిగించింది అని సెరెనా తెలిపింది.

షరపోవాపై వరుసగా 18 మ్యాచుల్లో గెలిచిన సెరెనాకు ఓవరాల్‌గా ఆమెపై 19-2 రికార్డు ఉండటం విశేషం. 2004 వింబుల్డన్ ఫైనల్, ఓ డబ్ల్యూటీఏ మ్యాచ్‌లో మాత్రమే సెరెనాపై షరపోవా గెలిచింది. సెరెనా వరుసగా గెలిచిన 18 మ్యాచుల్లోనూ షరపోవా గెలిచింది కేవలం మూడంటే మూడే సెట్లు. అయితే ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్‌లో మాత్రం షరపోవా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నదని సెరెనా కూడా చెబుతున్నది. ఎందుకంటే ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ మధ్యే కోర్టులో తిరిగి అడుగుపెట్టిన సెరెనా.. ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడింది.

మరోవైపు 15 నెలల నిషేధం తర్వాత షరపోవా.. ఈ టోర్నీకి పూర్తి సన్నద్ధంగా వచ్చింది. చివరిసారి ఈ ఇద్దరూ 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లో తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో సెరెనానే విజయం సాధించింది. ఆ తర్వాత డోప్ టెస్ట్‌లో విఫలమై షరపోవా 15 నెలల నిషేధం ఎదుర్కొన్నది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లోనే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆశించినా.. షరపోవాకు దక్కలేదు.

Story first published: Sunday, June 3, 2018, 16:52 [IST]
Other articles published on Jun 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X