న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2018 సీజన్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సెరెనా అనుమానమే?

By Nageshwara Rao
Serena not sure about Australian Open title defence

హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌‌లో పాల్గొనే విషయమై అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో వచ్చే ఏడాది మొదట్లో జరిగే తొలి గ్రాండ్ స్లామ్‌కు సెరెనా అనుమానమేనని అంటున్నారు. 2018 సీజన్‌లో జరుగుతున్న తొలి గ్రాండ్ స్లామ్ ఇది.

ఈ గ్రాండ్ స్లామ్ జనవరి 15 నుంచి 28 వరకు మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ పార్కులో జరగనుంది. గతేడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో సెరెనా విజేతగా నిలిచింది. అప్పుడు సెరెనా రెండు నెలల గర్భంతో ఉన్నది. సెరెనాకు అది 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెరెనా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు సెరెనా ఏ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనలేదు. అయితే సెరెనా కోచ్ ప్యాట్రిక్ మాత్రం 2018 సీజన్‌కు ఆమె సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. 'సెరెనా ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తోంది. త్వరలోనే ఆమె ఫ్లోరిడాలో ప్రాక్టీస్‌కు రాబోతుంది.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శరీరం టెన్నిస్‌కు ఎంత వరకు సహకరిస్తుందో చూసి ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడంపై ఓ నిర్ణయం తీసుకుంటుంది' అని తెలిపాడు. సెరెనాతో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యే వారిలో గత గ్రాండ్ స్లామ్ విజేతలు విక్టోరియా అజరెంకా, స్వెత్లానా కుజ్నెత్సోవ పేర్లు వినిపిస్తున్నాయి.

విక్టోరియా అజరెంకా గతంలో 2012, 13లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆమె ఓ కేసు నిమిత్తం ఈ ఏడాది జులై నుంచి ప్రాక్టీస్‌కు దూరంగా ఉంది.

Story first published: Wednesday, November 29, 2017, 18:22 [IST]
Other articles published on Nov 29, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X