న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానియా మీర్జా అరుదైన ఘనత.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డు!!

Sania Mirza Becomes First Indian to be Nominated for Fed Cup Heart Award


హైదరాబాద్:
భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా గురువారం అరుదైన ఘనత సాధించింది. ఫెడ్‌ కప్‌ హార్ట్‌ అవార్డు కోసం ఆసియా- ఓసియానియా జోన్‌ నుంచి సానియా మీర్జా, ప్రిస్కా మెడెలిన్‌ నుగ్రోరో (ఇండోనేసియా)లను సిఫార్సు చేశారు. దీంతో ఈ అవార్డుకు నామినేట్‌ అయిన తొలి భారత ప్లేయర్‌గా సానియా రికార్డుల్లోకి ఎక్కింది.

అలాంటి విచిత్ర‌మైన ప్రాంచైజీని ఎప్పుడూ చూడలేదు: స్టార్ ఆల్‌రౌండర్‌అలాంటి విచిత్ర‌మైన ప్రాంచైజీని ఎప్పుడూ చూడలేదు: స్టార్ ఆల్‌రౌండర్‌

జాన్‌ను స్టాండ్స్‌లో ఉంచి గేమ్ ఆడిన సానియా:

జాన్‌ను స్టాండ్స్‌లో ఉంచి గేమ్ ఆడిన సానియా:

ఫెడ్‌ కప్‌ హార్ట్‌ అవార్డు కోసం మే 1 నుంచి 8 వరకు జరిగే ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో అభిమానులు విజేతల్ని నిర్ణయిస్తారు. సానియా మీర్జా ఇటీవల నాలుగేళ్ల తర్వాత ఫెడ్ కప్‌లోకి తిరిగి వచ్చింది. తన 18 నెలల కుమారుడు ఇజాన్‌ను స్టాండ్స్‌లో ఉంచి గేమ్ ఆడి తొలిసారి ప్లే-ఆఫ్స్‌కు భారత్ అర్హత సాధించేందుకు సాయం చేసింది. ఈ అవార్డుకు ఎంపికవడం పట్ల సానియా ఆనందం వ్యక్తం చేసింది.

 ఫెడ్‌ కప్ గొప్ప విజయాల్లో ఒకటి:

ఫెడ్‌ కప్ గొప్ప విజయాల్లో ఒకటి:

'2003లో తొలిసారి భారత జెర్సీ ధరించి కోర్టులో బరిలో దిగడం మరిచిపోలేని అనుభూతి. ఇది 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో భారత టెన్నిస్‌ విజయాల్లో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. గత నెలలో ఫెడ్‌ కప్‌ ఫలితం నా క్రీడా జీవితంలోని గొప్ప విజయాల్లో ఒకటి. నా ప్రతిభను గుర్తించిన ఫెడ్‌ కప్‌ హార్ట్‌ అవార్డు సెలెక్షన్‌ ప్యానెల్‌కు కృతజ్ఞతలు' అని సానియా మీర్జా ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది.

 ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేత:

ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేత:

హార్ట్ అవార్డుల విజేతలను అభిమానులు ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఇది మే 1 నుంచి 8 వరకు కొనసాగుతుంది. ఫెడ్‌ కప్ హార్ట్ అవార్డుల 11వ ఎడిషన్ కోసం ఈ ఏడాది అనెట్ కోంటావిట్ (ఎస్టోనియా), ఎలినోరా మోలినారో (లగ్జంబర్గ్)లు యూరప్/ఆఫ్రికా జోన్ నుంచి నామినేట్ కాగా.. మెక్సికోకు చెందిన ఫెర్నాండా కాంట్రెరాస్ గోమెజ్, పరాగ్వేకు చెందిన వెరోనికా సెపెడ్ రాయ్గ్‌లు అమెరికా నుంచి నామినేట్ అయ్యారు.

 టెన్నిస్‌ ఆడేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే:

టెన్నిస్‌ ఆడేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే:

'టెన్నిస్‌లో పునరాగమనం కోసం రెండేళ్లు కష్టపడ్డా. బిడ్డకు జన్మనిచ్చి అన్ని అవాంతరాలు అధిగమించాను. ఇప్పుడు అర్ధంతరంగా ఆగిపోయా. మళ్లీ టెన్నిస్‌ ఆడేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే. నిజానికి 2020 టోక్యో ఒలింపిక్స్‌ ఆడాలన్న ఉద్దేశంతోనే పునరాగమనం చేశా. ఒలింపిక్స్‌ వాయిదా పడటం నాకు ప్రతికూలమే. వచ్చే ఏడాదికి నా వయసు ఒక సంవత్సరం పెరగడం కలిసొచ్చే అంశం కాదు. అయితే ఒలింపిక్స్‌కు ఇంకో ఏడాది సమయముంది. మునుపటిలా ఆడతాననే అనుకుంటున్నా' అని ఇటీవల 33 ఏళ్ల సానియా చెప్పింది.

Story first published: Tuesday, July 7, 2020, 15:26 [IST]
Other articles published on Jul 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X