న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌ నుంచి వైదొలిగిన ఫెడరర్‌

Roger Federer Withdraws From Rome QF

స్విట్జర్లాండ్‌ స్టార్ రోజర్ ఫెడరర్‌ రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌ నుండి అర్ధాంతరంగా వైదొలిగాడు. గాయం కారణంగా టోర్నీ నుండి వైడ్యూలుగుతున్నట్టు రోజర్ ఫెడరర్‌ తెలిపాడు. గ్రీస్‌ సంచలనం సిట్సిసాస్‌తో క్వార్టర్‌ ఫైనల్లో తలపడాల్సిన ఫెడరర్‌ కుడి కాలి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దీంతో సిట్సిసాస్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

'ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ తప్పట్లేదు. నేను వంద శాతం ఫిట్‌గా లేను. అందుకే మ్యాచ్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నాను' అని ఫెడరర్‌ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. 2015 తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫెడరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడనున్నాడు. గతవారం మాడ్రిడ్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో ఫెడరర్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే.

మాడ్రిడ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ ఫెదరర్‌ 6-3, 6-7 (11/13), 4-6తో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. 2 గంటల 10 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ అవనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.ఫెదరర్‌, థీమ్‌ ఇప్పటివరకు ఆరుసార్లు తలపడగా.. థీమ్‌ నాలుగుసార్లు విజయం సాయించాడు.

Story first published: Saturday, May 18, 2019, 9:20 [IST]
Other articles published on May 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X