న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనామకుడి చేతిలో ఓటమి: ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ఫెదరర్‌ దూరం

By Nageshwara Rao
Roger Federer to skip clay-court season again

హైదరాబాద్: స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతేకాదు ఈ సీజన్‌లో క్లేకోర్టు టోర్నీలు ఆడనని పేర్కొన్నాడు. మియామి మాస్టర్స్‌లో అనామకుడైన తనాసి కొకినకిస్‌ చేతిలో ఓడిన తర్వాత ఫెదరర్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

20 గ్రాండ్‌స్లామ్‌ టైటళ్లు గెలిచిన ఫెదరర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండో ఏడాది. మియామి మాస్టర్స్‌ టోర్నీలో మాత్రం రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 175వ ర్యాంకర్‌ థనాసి కొకినాకిస్‌ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ ఫెడరర్‌ 6-3, 3-6, 6-7 (4/7)తో ఓడిపోయాడు

గతేడాది ఇండియన్‌ వెల్స్, మయామి మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన ఫెడరర్‌ ఈసారి వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఈ ఓటమితో ఫెదరర్‌ ఏప్రిల్‌ 2న విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోనున్నాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకుంటాడు.

Story first published: Monday, March 26, 2018, 9:09 [IST]
Other articles published on Mar 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X