ఫెదరర్ గెలిచిన 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంవత్సరాల వారీగా (వీడియో)

Posted By: Subhan
Roger Federer's 20 Grand Slam wins after his Australian Open win

హైదరాబాద్: గాయాలను సవాల్ చేసి గమ్యాన్ని చేరుకున్నాడు ఫెదరర్. 2003లో మొట్ట మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అందుకున్న ఫెదరర్ పదిహేను సంవత్సరాల కృషితో 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు చేరుకున్నాడు. ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ పోరాటాన్ని ఆపకుండా ధైర్యంగా ముందుకుసాగాడు. అలా ఈ యోధుడు మరో యుద్ధంలో గెలిచాడు.

ఆదివారం పోటాపోటీగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఫెదరర్‌ 6-2, 6-7 (5), 6-3, 3-6, 6-1తో క్రొయేషియాకు చెందిన ఆరోసీడ్‌ మారిన్‌ సిలిచ్‌పై అద్భుత విజయం సాధించాడు. తద్వారా అత్యధికసార్లు ఈ ట్రోఫీ గెలుచుకున్న జొకోవిచ్‌ (సెర్బియా), రాయ్‌ ఎమర్సన్‌ (ఆస్ర్టేలియా) సరసన చేరాడు. ఇక మార్గరెట్‌ కోర్ట్‌, సెరెనా విలియమ్స్‌, స్టెఫీగ్రాఫ్‌ తర్వాత 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నాలుగో ప్లేయర్‌గా ఫెదరర్‌ నిలిచాడు.

ఫెదరర్ కంట కన్నీరు:
ఫైనల్‌ గెలిచిన వెంటనే రోజర్‌ ఫెదరర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ట్రోఫీ అందుకుంటూ రోజర్‌ కన్నీరు పెట్టుకుని కొద్దిసేపు అలాగే ఏడుస్తూ ఉండిపోయాడు. తర్వాత మాట్లాడి '2006లో ఇక్కడే ఫైనల్లో మార్కస్‌ బగ్దాతిస్‌ను ఓడించిన రాత్రికంటే నేటి రాత్రి ఎంతో మధురమైనది. ఎందుకంటే..ఈసారి ఇక్కడ నేను ఫేవరెట్‌గా బరిలోదిగి అందుకు తగ్గట్టుగా ఆడి విజయం సాధించాను. ఈ వయస్సులోను శారీరకంగా, మానసికంగా ఇంత దృఢంగా ఉండడానికి నా భార్య మిర్కానే కారణం'అని రోజర్‌ వివరించాడు.

వరుసగా 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు:

Wimbledon 2003
Australian Open 2004
Wimbledon 2004
US Open 2004
Wimbledon 2005
US Open 2005
Australian Open 2006
Wimbledon 2006
US Open 2006
Australian Open 2007
Wimbledon 2007
US Open 2007
US Open 2008
French Open 2009
Wimbledon 2009
Australian Open 2010
Wimbledon 2012
Australian Open 2017
Wimbledon 2017
Australian Open 2018

* 2 : ఈసారి ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో ఫెడరర్‌ ఓడిన సెట్లు
* 9413 : మెల్‌బోర్న్‌లో ఫెడెక్స్‌ గెలుపోటముల రికార్డు
* 33252 : గ్రాండ్‌స్లామ్స్‌లో రోజర్‌ జయాపజయాల రికార్డు
* 91 : సిలిచ్‌పై స్విస్‌ స్టార్‌ రికార్డు

ప్రైజ్‌మనీ

విజేత - రూ. 20.62 కోట్లు
రన్నరప్‌ - రూ. 10.31 కోట్లు

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 12:50 [IST]
Other articles published on Jan 30, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి