న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరంభంలో తడబడ్డ ఫెదరర్, వింబుల్డన్ నుంచి నిష్క్రమణ

Roger Federer: Novak Djokovic admits surprise over Swiss aces Wimbledon exit

హైదరాబాద్: భారీ అంచనాలతో వింబుల్డన్ బరిలోకి దిగిన ఫెదరర్ ఆశలు నిలబెట్టుకోలేకపోయాడు. కీలక సమయంలో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకోలేకపోయిన డిఫెండింగ్ చాంపియన్. వింబుల్డన్ నుంచి నిష్క్రమించాడు. తొమ్మిదో టైటిల్ కోసం బరిలోకి దిగిన ఈ టాప్‌సీడ్ ప్లేయర్.. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో 6-2, 7-6 (7/5), 5-7, 4-6, 11-13తో ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడాడు.

తొలి సెట్‌.. రెండో సెట్‌లో కొంచెం చెమటోడ్చాల్సి వచ్చినా.. సెట్‌ సొంతమైంది. మూడో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించి 5-4 ఆధిక్యంలో చేరుకున్నాడు. ఒక్క పాయింట్‌ సాధిస్తే.. సెట్‌తో పాటు మ్యాచ్‌ కూడా సొంతమవుతుంది. ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా.. గేమ్ కాపాడుకోలేకపోయాడు.

 2013 తర్వాత ఫెదరర్‌కు ఇదే తొలిసారి

2013 తర్వాత ఫెదరర్‌కు ఇదే తొలిసారి

తొలి రెండు సెట్లు నెగ్గి, మూడో సెట్‌లో మ్యాచ్‌ పాయింట్‌ ముంగిట నిలిచిన అతడిని.. దక్షిణాఫ్రికా వెటరన్‌, ఎనిమిదో సీడ్‌ కెవిన్‌ అండర్సన్‌ అనూహ్య రీతిలో ఓడించాడు. ఇప్పటికే 8 వింబుల్డన్‌లు సహా 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి ఈసారి కూడా ఆల్‌ఇంగ్లాండ్‌ క్లబ్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోజర్‌.. తనతో నాలుగుసార్లు తలపడి అన్నిసార్లూ ఓడిన అండర్సన్‌ చేతిలో ఓడి పరాజయం పాలవుతాడని అనుకొని ఉండరు. 2013 తర్వాత ఆరంభ రౌండ్లలోనే ఓడటం ఫెదరర్‌కు ఇదే తొలిసారి. రెండు సెట్లు ఆధిక్యంలో ఉండి మ్యాచ్ ఓడటం 2011 తర్వాత ఇదే మొదటిసారి.

ఫెదరర్‌ చేతిలో గతంలో సెట్ కూడా అండర్సన్..

ఫెదరర్‌ చేతిలో గతంలో సెట్ కూడా అండర్సన్..

నాలుగు గంటల 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు గెలిచి జోరుమీదున్న స్విస్ స్టార్‌కు మూడోసెట్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఫెదరర్‌తో గతంలో తలపడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క సెట్ కూడా గెలువలేకపోయిన అండర్సన్.. ఈ మ్యాచ్‌లో భారీ ఏస్‌లతో విరుచుకుపడ్డాడు. కీలకమైన మూడోసెట్‌లో 5-4 ఆధిక్యంలో ఉన్న దశలో ఫెదరర్ మ్యాచ్ పాయింట్ కోసం కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్‌ను అండర్సన్ సమర్థంగా అడ్డుకున్నాడు.

బ్రేక్ పాయింట్లను కాపాడుకోలేక మూల్యం

బ్రేక్ పాయింట్లను కాపాడుకోలేక మూల్యం

ఆ వెంటనే సర్వీస్ నిలబెట్టుకుని సెట్‌ను గెలిచాడు. నాలుగోసెట్ నుంచి ఫెదరర్ ఆట పూర్తిగా గాడి తప్పింది. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లలో ఏమాత్రం మెరుగు కనిపించలేదు. ఏడో గేమ్‌లో స్విస్ ప్లేయర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అండర్సన్ సెట్ స్కోరును సమం చేశాడు. నిర్ణయాత్మక ఐదోసెట్‌లో 3-4తో వెనుకబడ్డ ఫెదరర్ వచ్చిన బ్రేక్ పాయింట్లను కాపాడుకోలేక మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్‌గా దిగ్గజాన్ని ఓడించిన అండర్సన్.. 1983 తర్వాత సెమీస్‌కు చేరిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

సెమీస్‌ చేరిన నొవాక్‌ జకోవిచ్‌

సెమీస్‌ చేరిన నొవాక్‌ జకోవిచ్‌

మరోవైపు చాన్నాళ్ల తర్వాత ఫామ్‌ అందుకున్న మాజీ ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ సెమీస్‌ చేరాడు. అతను క్వార్టర్స్‌లో 6-3, 3-6, 6-2, 6-2తో జపాన్‌ ఆటగాడు నిషికోరిని సులువుగానే ఓడించాడు. ఇస్నర్‌-రోనిచ్‌ మ్యాచ్‌ విజేతతో అండర్సన్‌ సెమీస్‌ ఆడతాడు. జకోవిచ్‌.. నాదల్‌-డెల్‌పొట్రో మ్యాచ్‌ గెలిచిన ఆటగాడితో తలపడతాడు.

Story first published: Thursday, July 12, 2018, 11:13 [IST]
Other articles published on Jul 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X