న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

24 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకుంటాననే ఆలోచనే రాలేదు: ఫెదరర్

Roger Federer feels winning 24 grand slams is

హైదరాబాద్: '24 గ్రాండ్ స్లామ్‌లను గెలవాలనే ఆలోచనే నాకు లేదు' అంటున్నాడు రోజర్ ఫెదరర్. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న ఫెదరర్ విజయోత్సాహాన్ని ఇలా పంచుకున్నాడు. మార్లిన్ సిలిచ్‌పై గెలిచిన మ్యాచ్‌తో కలిపి ఫెదరర్ ఐదు సెట్ల సిరీస్'ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. అతని 36 ఏళ్ల వయస్సును ఏ మాత్రం లెక్కచేయక పోటీకి దిగి కెరీర్‌లోనే 20 టైటిల్‌ను గెలుచుకున్నాడు.

చరిత్ర సృష్టించిన ఫెదరర్: భావోద్వేగంతో కన్నీరు, 20వ గ్రాండ్ స్లామ్చరిత్ర సృష్టించిన ఫెదరర్: భావోద్వేగంతో కన్నీరు, 20వ గ్రాండ్ స్లామ్

ఇదే ఉత్సాహంతో ఇదే పట్టుదలతో మీరు 24 గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకుంటారా అని అడిగిన ప్రశ్నకు బదులుగా ఫెదరర్ 'నాకు తెలియదు. నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు కూడా. అయినా అది కూడా ఎంతో దూరంలో లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. తాను దేని కోసం ఎదురుచూడనని తెలిపాడు. 'నాకు ఇప్పటికీ ఈ విజయం నమ్మశక్యంగా లేదు. ఈ వయస్సులో ఇంత సాధించగలను అని నేను కూడా అనుకోలేదు.'అని పేర్కొన్నాడు.

సిలిచ్‌ ఆట చూస్తే ఐదో సెట్లో ఫెదరర్‌కు ముప్పులాగే కనిపించింది. అప్పటికే అతను నాలుగు సెట్లు ఆడి అలసిపోయాడు కూడా! అయితే అందర్ని ఆశ్చర్యపరుస్తూ రోజర్‌ విజృంభించాడు. తన క్లాసిక్‌ షాట్లతో మారిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు చూస్తుండగానే 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన అతను.. ఆ తర్వాత 5-1తో ఛాంపియన్‌షిప్‌ ముంగిట నిలిచాడు.

మెరుపు ఏస్‌తో 40-0తో నిలిచిన రోజర్‌.. తన రిటర్న్‌ను సిలిచ్‌.. నెట్‌ దాటించలేకపోవడంతో సంబరాల్లో మునిగిపోయాడు. గెలిచాక కొన్ని సెకన్ల పాటు నమ్మలేనట్లు చూసిన అతను.. తేరుకున్న తర్వాత అభిమానులకు అభివాదం చేశాడు. ట్రోఫీ అందుకుంటున్న సమయంలో రోజర్‌.. భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్‌లో 20వ టైటిల్‌ సాధించిన ఆనందంలో కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.

రోజర్‌ సాధించిన గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ విజయాలు:
* ఓవరాల్‌గా అత్యధిక టైటిళ్లు సాధించిన జాబితాలో మార్గరేట్‌ కోర్ట్‌ (24), సెరెనా (23), స్టెఫీగ్రాఫ్‌ (22) తర్వాతి స్థానం ఫెదరర్‌ (20)దే.
* ఇప్పటిదాకా ఫెదరర్‌ గెలిచిన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు 20. ఇందులో ఎనిమిది వింబుల్డన్‌, ఆరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఐదు యుఎస్‌ ఓపెన్‌, ఒక ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఉన్నాయి.
*ఫెదరర్‌కు ఇది ఆరో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌. ఈ టోర్నీలో అత్యధిక టైటిళ్లు సాధించిన రాయ్‌ ఎమర్సన్‌, జకోవిచ్‌ సరసన అతను చేరాడు.

ఫెదరర్ తన మొట్ట మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను 2008వ సంవత్సరంలో గెలుపొందాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 11:54 [IST]
Other articles published on Jan 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X