నెటిజన్లు ఫిదా: మిక్కీ మౌస్‌తో డ్యాన్స్‌ చేసిన ఫెదరర్ (వీడియో)

Posted By:

హైదరాబాద్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 19 గ్రాండ్ స్లామ్ టోర్నీల విజేతగా చరిత్ర సృష్టించిన రోజర్ ఫెదరర్ టెన్నిస్‌ కోర్టులో మ్యాచ్‌ మధ్యలో మిక్కీ మౌస్‌ వేషధారణలో ఉన్న వ్యక్తితో కలిసి చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు.

చైనాలోని షాంగై రోలెక్స్‌ మాస్టర్స్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీ జరుగుతోంది. టోర్నీలో భాగంగా మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో మిక్కీ మౌస్‌ వేషధారణలో ఉన్న వ్యక్తి ఫెదరర్‌ వద్దకు వచ్చి డ్యాన్స్‌ చేయమని కోరాడు. దీంతో రోజర్ ఫెదరర్ వెంటనే తన రాకెట్‌ను పక్కన పెట్టి కోర్టులోనే సరదాగా స్టెప్పులేశాడు.

Roger Federer Danced With Mickey Mouse. Video Will Cure Your Monday Blues

ఇందుకు సంబంధించిన వీడియోని టెన్నిస్ టీవీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫెదరర్ డ్యాన్స్ వీడియోని చూసిన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫెదరర్ అలా కోర్టులో డ్యాన్స్‌ చేసి అభిమానులను అలరించడం ఆకట్టుకుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Story first published: Tuesday, October 10, 2017, 15:26 [IST]
Other articles published on Oct 10, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి