సున్నా చేర్చడం మర్చిపోయా: కోటి ఇప్పించండి!

Posted By:

హైదరాబాద్: టెన్నిస్‌ స్టార్ లియాండర్‌ పేస్‌ నుంచి విడిపోయిన అతడి మాజీ భార్య రియా పిళ్లై తరఫు న్యాయవాదులు చేసిన చిన్న పొరపాటు ఆమెకు పెద్ద షాకిచ్చింది. తన బిడ్డ చదువులు, పోషణకయ్యే ఖర్చుల నిమిత్తం పేస్ నుంచి పరిహారం ఇప్పించాల్సిందిగా రియా పిళ్లై గతంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా పిళ్లై తన పిటిషన్‌లో కోరింది. అయితే ఆమె లాయ‌ర్లు చేసిన చిన్న త‌ప్పు ఆమెకు పెద్ద షాకే ఇచ్చింది. పిటిషన్‌లో ఆమె తరఫు న్యాయవాదులు చేసిన పొరపాటు తాజాగా వెలుగులోకి వచ్చింది. పిటిషన్‌లో ఆమె లాయ‌ర్లు పొర‌పాటున ఒక సున్నా త‌క్కువ‌గా వేసి పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

కోటి రూపాయలు కాస్తా రూ.10 లక్షలు

కోటి రూపాయలు కాస్తా రూ.10 లక్షలు

దీంతో కోటి రూపాయలు కాస్తా రూ.10 లక్షలుగా మారింది. దీనిపై మంగళవారం పిళ్లై తరఫు న్యాయవాదులు గుంజన్ మంగ్లా, అమ్నా ఉస్మాన్.. ముంబైలోని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ నింపే క్రమంలో కోటికి బదులు పది లక్షలుగా పేర్కొన్నామని జరిగిన తప్పును పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు విన్న‌వించారు.

తండ్రితో కలిసి కోర్టుకు హాజరైన పేస్

తండ్రితో కలిసి కోర్టుకు హాజరైన పేస్

మంగళవారం నాటి విచారణకు తన తండ్రి డాక్టర్ వేస్ పేస్‌తో కలిసి లియాండర్ కోర్టుకు హాజరుకాగా, తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ పిళ్లై వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకుంది. భరణం కింద నెలకు రూ. 2.62 లక్షలు పేస్ నుంచి తనకు ఇప్పించాల్సిందిగా రియా పిటిషన్‌లో పేర్కొంది.

రియా పిళ్లై డిమాండ్స్ ఇవే

రియా పిళ్లై డిమాండ్స్ ఇవే

లేదంటే మొత్తంగా 1.43 కోట్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు తన కూతురు అవసరాల కోసం ఇన్నోవా, కరోలా, హోండా సిటీ లాంటి ఏదైనా కారును సమకూర్చాలని తన డిమాండ్లలో పిళ్లై ప్రముఖంగా పేర్కొంది. అయితే ఈ జూలైలో దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు.. కేసును ఆర్నెళ్ల లోపు పూర్తి చేయాలని ముంబై కోర్టును ఆదేశించింది.

పేస్‌పై 2014లో రియా పిళ్లై గృహహింస కేసు

పేస్‌పై 2014లో రియా పిళ్లై గృహహింస కేసు

పేస్‌పై 2014లో రియా పిళ్లై గృహహింస కేసు వేసింది. ఈ కేసును ఆరు నెలలో పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఈ ఏడాది జులైలో ముంబై కోర్టును ఆదేశించింది. దీంతో రియా తరఫు న్యాయవాదులు పరిహారం కోరుతూ బాంద్రా కోర్టులో మధ్యంతర పిటిషన్ దరఖాస్తు చేశారు.

Story first published: Thursday, September 14, 2017, 9:45 [IST]
Other articles published on Sep 14, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి