న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్‌లో 11వ సారి ఫైనల్‌కు: రఫెల్ నాదల్ Vs డొమినిక్ థీమ్

By Nageshwara Rao
Rafael Nadal crushes Del Potro to enter 11th French Open final, sets up summit clash with Thiem

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రఫెల్ నాదల్ సత్తా చాటాడు. మట్టికోర్టులో మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాదల్‌ 6-4, 6-1, 6-2తో ఐదో సీడ్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై అలవోక విజయం సాధించాడు. ఇప్పటికే రికార్డు స్థాయిలో పదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ గెలిచిన నాదల్ 11వ సారి ఫైనల్ చేరుకున్నాడు.

ఈ క్రమంలో రోజర్‌ ఫెదరర్‌ (11-వింబుల్డన్‌) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రికార్డు స్థాయిలో 11వసారి ఫైనల్‌ చేరిన రెండో ఆటగాడిగా రఫెల్ నాదల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఓవరాల్‌గా నాదల్‌ కెరీర్‌లో ఇది 24వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. రెండు గంటలా 14 నిమిషాల పాటు జరిగిన సెమీస్ పోరులో నాదల్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు.

ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వని రఫెల్ నాదల్

తొలి సెట్‌లో కొంత తడబడ్డప్పటికీ ఆ తర్వాత వరుస సెట్లలో నాదల్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వలేదు. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లకు తోడు భీకరమైన సర్వ్‌లతో డెల్‌పొట్రోను ముప్పుతిప్పలు పెట్టాడు. నాదల్‌ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా డెల్‌పొట్రో వినియోగించుకోలేదు. దీనికి తోడు 32 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

నాదల్ 35 విన్నర్లు కొట్టగా, డెల్‌పొట్రో 20 విన్నర్లు

నాదల్ 35 విన్నర్లు కొట్టగా, డెల్‌పొట్రో 20 విన్నర్లతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)తో నాదల్‌ తలపడనున్నాడు. మరో సెమీఫైనల్లో థీమ్‌ 7-5, 7-6 (12/10), 6-1తో సెచి నాటో (ఇటలీ)పై అతికష్టం మీద విజయం సాధించాడు. 1995లో థామస్‌ ముస్టర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాక మరో ఆస్ట్రియా ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్‌ చేరడం ఇదే ప్రథమం.

హోరాహోరీగా పోరాడి టైబ్రేక్‌లో సెట్‌ను సొంతం చేసుకున్న థీమ్‌

క్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)ను ఓడించిన సెచినాటో అదే జోరును కనబర్చలేకపోయాడు. రెండు గంటలా 17నిమిషాల పోరులో తొలి సెట్‌ను 7-5తో దక్కించుకున్న థీమ్‌కు రెండో సెట్‌లో సెచినాటో నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా వెనుకకు తగ్గకుండా హోరాహోరీగా పోరాడి టైబ్రేక్‌లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు.

6-3: థీమ్‌తో నాదల్‌ ముఖాముఖి రికార్డు

ఇద్దరు 26 అనవసర తప్పిదాలకు పాల్పడ్డారు. థీమ్ 37 విన్నర్లతో ముందంజలో నిలువగా, సెచినాటో 24కు పరిమితమై ఓటమిపాలయ్యాడు. థీమ్‌తో ముఖాముఖి రికార్డులో నాదల్‌ 6-3తో ఆధిక్యం లో ఉన్నాడు. అయితే థీమ్‌ చేతిలో నాదల్‌ ఓడిపోయిన మూడు మ్యాచ్‌లూ క్లే కోర్టులపైనే కావడం గమనార్హం. మరోవైపు శనివారం జరిగే మహిళల ఫైనల్స్‌లో హాలెప్, స్టీఫెన్స్ తలపడనున్నారు.

Story first published: Saturday, June 9, 2018, 11:19 [IST]
Other articles published on Jun 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X