న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!

 Novak Djokovic wins record 22nd Grandslam. He wins his 10th Australian Open title.

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిక్ సంచలనం సృష్టించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ను పదోసారి గెలుచుకున్నాడు. దీంతో నొవాక్‌ జొకోవిచ్‌ తిరిగి టాప్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. దీంతో ఇప్పటివరకు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న కార్లోస్‌ అల్కారజ్‌ రెండో స్థానానికి పడిపోయాడు. ఈ విజయంతో జొకోవిచ్‌ 374వ వారం అగ్రస్థానం పదిలం చేసుకున్నాడు. ఈ సందర్భంగా జోకొవిక్ కు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

తన ఆట చాలా బాగుందని తన నమ్మకం అన్నాడు జోకో. ప్రస్తుతం తను చక్కగా ఆడుతున్నట్లు అనుకుంటున్నా అని చెప్పాడు. ఇప్పుడు గెలిచిన ఆస్ట్రేలియన్ ఓపెన్ అతని కెరీర్లో 22వ గ్రాండ్ స్లామ్. ఈ రికార్డ్ సాధించిన తర్వాత కూడా తనలో ఇంకా చాలా ఆట మిగిలే ఉందని జోకో అంటున్నాడు. అంతేకాదు, గతేడాది జూన్ నెలలో కోల్పోయిన తన నంబర్ వన్ ర్యాంకును కూడా జోకో తిరిగి పొందాడు. 'నాలో ఇంకా చాలా మోటివేషన్ ఉంది. చూద్దాం.. అది నన్ను ఎంత దూరం తీసుకెళ్తుందో?' అని జోకో చెప్పాడు.

ఈ సందర్భంగా మరో టెన్నిస్ స్టార్ నాదల్ సంతోషం వ్యక్తం చేశాడు. జోకోకు కంగ్రాట్స్ చెప్పాడు. 22వ గ్రాండ్ స్లామ్ సాధించి తన రికార్డు సమం చేయడంపై నాదల్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన నాదల్.. "కంగ్రాచులేషన్స్ నోల్. నువ్వు నిజంగా అర్హుడివి. నీకు, నీ టీంకు శుభాకాంక్షలు. ఎంజాయ్" అని పోస్ట్ పెట్టాడు. దీనిపై జోకో కూడా రియాక్ట్ అయ్యాడు. నాదల్ కి ధన్యవాదాలు తెలిపాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాదల్.. ఈసారి రెండో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు. అతనికి ఈ మ్యాచులో నడుం గాయం అవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

Story first published: Tuesday, January 31, 2023, 9:20 [IST]
Other articles published on Jan 31, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X