న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Naomi Osaka: నిండా ముంచిన మీడియా బాయ్‌కాట్: ఫ్రెంచ్ ఓపెన్ నుంచి విత్ డ్రా: బెస్ట్ థింగ్ అదే

 Naomi Osaka withdraws from French Open after expulsion threat over media boycott

పారిస్: రసవత్తరంగా ఆరంభమైన ఓల్డ్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ 2021లో అనుకోని కుదుపు. జపనీస్ స్టార్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా (Naomi Osaka) విత్ డ్రా అయ్యారు. ఈ టోర్నమెంట్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభమైన రెండోరోజే ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్న ఈ యంగెస్ట్ ఏస్ టెన్నిస్ ప్లేయర్.. తాను ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. దీనిపై ఓ సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

డిస్‌క్వాలిఫై వార్నింగ్‌తో..

డిస్‌క్వాలిఫై వార్నింగ్‌తో..

మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లు తప్పనిసరిగా మీడియా సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. మీడియా సమావేశంలో పాల్గొనని ఆటగాళ్లపై జరిమానా విధించడం ఆనవాయితీగా వస్తోంది. ఫ్రెంచ్ కాలమానం ప్రకారం.. సోమవారం ఒసాకా తొలి రౌండ్‌లో విజయం సాధించిన తరువాత మీడియా సమావేశానికి హాజరు కాలేదు. దాన్ని బాయ్‌కాట్ చేశారు. దీనితో ఆమెకు 15,000 డాలర్ల జరిమానాను విధించారు మ్యాచ్ రెఫరీ. అదే మళ్లీ రిపీట్ చేస్తే టోర్నమెంట్ నుంచి డిస్‌క్వాలిఫై చేస్తామనీ హెచ్చరించారు.

తప్పుకోవడానికి గల కారణాలతో

తప్పుకోవడానికి గల కారణాలతో

ఈ సంఘటన చోటు చేసుకున్నమరుసటి రోజే- ఆమె ఈ గ్రాండ్‌స్లామ్ రేసు నుంచి తప్పుకొన్నారు. షెడ్యూల్ ప్రకారం..ఈ నెల 2వ తేదీన ఆమె తన రెండో రౌండ్‌‌ను ఆడాల్సి ఉంది. అదే సమయంలో ఆమె ఈ టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. ఓ ప్రకటనను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. తన కేరీర్‌లో ఇలాంటి రోజొకటి వస్తుందని భావించలేదని చెప్పారు. కొంతకాలంగా తాను మానసిక ఆందోళనకు గురవుతున్నానని చెప్పారు. ఈ టోర్నీలో కూడా అది కొనసాగుతోందని, అందుకే తప్పుకోవాల్సి వచ్చిందని వివరించారు. వైదొలగుతున్నట్లు తాను తీసుకున్న నిర్ణయం ఈ టోర్నమెంట్ మొత్తానికీ బెస్ట్‌ థింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు.

సోషల్ యాంగ్జయిటీ నుంచి బయటపడటానికి..

ఆటపై తాను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతోన్నానని, దీన్ని తాను ఎప్పుడూ కోరుకోలేదని చెప్పారు. 2018 యూఎస్‌ ఓపెన్‌ నుంచి మానసిక సమస్యలు వెంటాడుతున్నాయని, రోలండ్ గ్యారోస్‌లో కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. సోషియల్ యాంగ్జయిటీ నుంచి బయట పడటానికి తరచూ సంగీతాన్ని వింటున్నానని, తన చెవులకు ఎప్పుడూ హెడ్‌ఫోన్స్ ఉంటాయని తెలిపారు. తాను తరచూ హెడ్‌పోన్స్ పెట్టుకోవడానికి కారణం అదేనని చెప్పారు. అంతే తప్ప తాను ఇంట్రావర్టెడ్ కాదని స్పష్టం చేశారు.

మీడియా ప్రతినిధలకు సారీ..

మీడియా ప్రతినిధలకు సారీ..

టెన్నిస్ మ్యాచ్‌లను కవర్ చేసే మీడియా ప్రతినిధులు.. ప్రతీసారీ తన పట్ల సానుకూలంగా ఉంటూ వచ్చారని, సమావేశానికి హాజరు కాలేనందుకు వారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులకు తాను వ్యక్తిగతంగా లేఖ రాశానని చెప్పారు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన ఒసాకా టైటిల్ హాట్ ఫేవరెట్. ఫ్రెంచ్ ఓపెన్‌లో భాగంగా ఆదివారం నాటి సింగిల్స్ తొలి రౌండ్‌లో 6-4, 7-6 (7/4)తో రొమేనియాకు చెందిన పాట్రికా మారియాటిగ్‌పై ఘన విజయాన్ని సాధించారు. రెండోరౌండ్‌లో అనా బొగ్డాన్‌ను ఎదుర్కోవాల్సి ఉంది.

Story first published: Tuesday, June 1, 2021, 7:19 [IST]
Other articles published on Jun 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X