మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ విజేతగా జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)ని 6-4, 6-3 తేడాతో చిత్తుచేసింది. తుది పోరులో ఫేవరేట్‌గా దిగిన ఒసాకా.. ప్రత్యర్థి బ్రాడీపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వరుస సెట్లలో గెలిచింది. ఈ విజయంతో ఒసాకా తన కెరీర్‌లో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. అందులో రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్‌తో పాటు రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ (2019,2021) టైటిల్స్ ఉన్నాయి.
ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. 19ఫోర్లు, 11సిక్సులతో విధ్వంసం! 324 పరుగుల తేడాతో విజయం!
ఫైనల్ మ్యాచ్‌లో ఒసాకా తన ప్రత్యర్థి బార్డీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో తొలి సెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా.. రెండో సెట్‌ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఓపెన్ ఎరా టెన్నిస్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రెండవసారి గెలిచిన 12వ క్రీడాకారిణిగా నవోమి ఒసాకా నిలిచింది. కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను వరుసగా రెండోసారి గెలుచుకొని చరిత్ర సృష్టించింది. వరుసగా 21 మ్యాచ్‌లు గెలిచిన ఒసాకా.. హార్డ్ కోర్టు క్వీన్‌గా రూపాంతరం చెందుతోంది.
𝒯𝒽𝒶𝓉 𝓂𝑜𝓂𝑒𝓃𝓉.
— #AusOpen (@AustralianOpen) February 20, 2021
When @naomiosaka became our 2021 Women's Singles champion 🏆#AO2021 | #AusOpen pic.twitter.com/Id3ZZhaJHh
ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రత్యర్థి జెన్నిఫర్ బ్రాడీకి ఇచ్చిన కాంప్లిమెంట్ కూడా నవోమి ఒసాకా స్పెషల్‌గా ఉంది. తనకు భవిష్యత్తు ప్రత్యర్థి బ్రాడీనే అని గతంలో చెప్పిన మాటలను ఆమె గుర్తు చేసింది. గత రెండేళ్ల నుంచి ఒసాకా ప్రదర్శన అద్భుతంగా ఉంది. గడిచిన ఆరు హార్డ్‌కోర్ట్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడిన ఒసాకా.. వాటిల్లో నాలుగింటిలో చాంపియన్‌గా నిలిచింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆమె ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ రికార్డును బట్టి ఆమె ఎంత ఫామ్‌లో ఉందో తెలిసిపోతుంది.
2016లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నవోమి ఒసాకా ఓ క్వాలిఫయర్‌గా గ్రాండ్‌స్లామ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ ఏడాది మూడో రౌండ్‌లో ఓడిపోయింది. ఏప్రిల్ 2016లో వరల్డ్ వంద ర్యాంకుల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఏడాది టాప్ 50లో చోటు దక్కించుకున్నది. ఆ ఏడాదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఆడింది. 2018 మార్చిలో తొలి డబ్ల్యటీఏ టైటిల్ గెలుచుకున్నది. ఆ టోర్నీలో షరపోవా, కరోలినా, హలెప్ లాంటి వాళ్లను ఓడించింది. తన కెరీర్‌లో వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ గెలిచిన మోనికా సెలెస్ (1991) రికార్డును సమం చేసింది.
Concentration at 💯🙌@naomiosaka | #AusOpen | #AO2021 pic.twitter.com/qFF1eC1pkt
— #AusOpen (@AustralianOpen) February 20, 2021