న్యూ ఢిల్లీ: ప్రస్తుతం తాను గర్భవతిని అంటూ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్ ప్రకటించింది. తన 38వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఈ అనౌన్స్ మెంట్ చేసింది. వచ్చే పుట్టినరోజుకల్లా తమ కుటుంబం ముగ్గురు సభ్యులతో ఉంటుందని తెలిపింది. హరాల్డ్ లీమన్ అనే మాజీ స్పోర్ట్స్ ఫిజీషియన్ ను హింగిస్ పెళ్లాడింది.
'మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. ఈ సెలబ్రేషన్స్ ను జంటగా జరుపుకోవడం ఇదే చివరిసారి అని చెప్పడానికి సంతోషిస్తున్నా. మా కుటుంబం ముగ్గురికి పెరుగుతోందని ఎంతో ఎగ్జైటింగ్ గా చెబుతున్నా' అంటూ ట్వీట్ చేసింది.
Thanks for all the birthday wishes! Happy to share that this will be the last time we’ll celebrate as a couple...excited to announce that we will become a family of three! pic.twitter.com/FRrpndFxxH
— Martina Hingis (@mhingis) September 30, 2018
హింగిస్ తన కెరీర్లో ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచింది. 209 వారాల పాటు మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో కొనసాగింది. 23 ఏళ్ల తన సుదీర్ఘమైన కెరీర్ కు 2017లో ఆమె ముగింపు పలికింది. అయితే ఇంతకు ముందే ఆమె రెండు సార్లు రిటైర్ కావడం గమనార్హం. 2003లో 22 ఏళ్ల వయసులో తొలిసారి రిటైర్ అయింది. 2007 నవంబర్ లో తుంటి ప్రాంతంలో గాయం కావడం.. డోపింగ్ టెస్టులో కొకైన్ ఆనవాళ్లు బయటపడటంతో మరోసారి రిటైర్మెంట్ తీసుకుంది.
Arre bechaara.. clearly the poor guy has been watching a different Asia Cup!! https://t.co/c6JV6IHE8Y
— Sania Mirza (@MirzaSania) September 26, 2018
భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రస్తుతం గర్భిణీ కాగా, మరి కొద్ది రోజుల్లో ఓ శిశువుకు జన్మనిచ్చే సంతోషంలో ఉంది. అయితే ఈమె తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే సానియా.. ఈ మధ్య పాక్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు గట్టిగానే బదులిచ్చింది. దీంతో అతను చేసిన ట్వీట్‌ను క్షణాల్లోనే డిలీట్ చేసేసుకున్నాడు.