న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూర్తి జాబితా ఇదే: ఆరు అవార్డులతో చరిత్ర సృష్టించిన రోజర్ ఫెదరర్

By Nageshwara Rao
Laureus World Sports Awards 2018: Roger Federer creates history [Full list of winners]

హైదరాబాద్: మొనాకో వేదికగా జరిగిన లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రెండు అవార్డులను గెలుచుకున్నాడు. వరల్డ్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు బెస్ట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

దీంతో ఫెదరర్ జాబితాలో మొత్తం ఆరు అవార్డులు చేరాయి. తద్వారా అత్యధిక లారస్ అవార్డులను గెలుచుకున్న క్రీడాకారుడిగా రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో ఫెదరర్‌తో పాటు పుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, ఫార్ములా వన్ రేసర్ లూయిస్ హామిల్టన్, టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్‌లు పోటీ పడ్డారు.

అయితే చివరకు ఆ అవార్డు రోజర్ ఫెదరర్‌నే వరించడం విశేషం. ఇటీవలే 36 ఏళ్ల వయసులో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అయి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను నెగ్గిన రోజర్ ఫెదరర్ తాజాగా రోటర్‌డామ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని ఆరేళ్ల తర్వాత మళ్లీ వరల్డ్ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తద్వారా టెన్నిస్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అవార్డు అందుకున్న అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ 'ఇంతటి స్థాయికి వస్తానని నేను నమ్మలేకపోతున్నా. ఈ ఏడాది నాకెంతో స్పెషల్. టెన్నిస్‌లో తిరిగి అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఎప్పడూ ఉద్వేగంగానే ఉంటుంది. నా డ్రీమ్ గతేడాది నెరవేరింది' అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే స్పోర్ట్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సెరెనా విలియర్స్ సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఖాతాలో మొత్తం ఐదు అవార్డులు చేరాయి. రఫెల్ నాదల్ జాబితాలో మూడు అవార్డులు ఉన్నాయి.

లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులు 2018: పూర్తి జాబితా:
* World Sportsman of the Year: Roger Federer (Tennis)
* World Sportswoman of the Year: Serena Williams (Tennis)
* Comeback of the Year: Roger Federer (Tennis)
* Sportsperson of the Year with a disability: Marcel Hug (Athletics)
* Breakthrough of the Year: Sergio Garcia (Golf)
* Action Sportsperson of the Year: Armel Le Cleac'h (Sailing)
* Team of the Year: Mercedes (F1)
* Exceptional Achievement Award: Francesco Totti (Football)
* Lifetime Achievement Award: Edwin Moses (Track & Field athlete)

Story first published: Wednesday, February 28, 2018, 16:25 [IST]
Other articles published on Feb 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X