న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2022 : విజేత ఇగా స్వియాటెక్.. ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ విన్నర్‌గా రికార్డ్

Iga Swiatek clinched Us Open Title This is her second Grand Slam title of the year

శనివారం జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియటెక్ వరుస సెట్లలో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జబీర్‌ను ఓడించి టైటిల్ అందుకుంది. ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఆమె గెలుచుకుంది. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదో సీడ్ ప్లేయర్ అయిన జబీర్‌తో పొలాండ్‌కు చెందిన స్వియాటెక్ మధ్య గంట 52నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. 6-2, 7-6 (7/5)తో రెండో సెట్‌లో జబీర్ పోరాడి ఓడిపోయింది. జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌లో స్వియాటెక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

2016తర్వాత ఒకే సీజన్‌లో రెండు గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న మొదటి మహిళగా 21ఏళ్ల స్వియాటెక్ నిలిచింది. స్వియాటెక్ కెరీర్లో ఇది 10వ టైటిల్ కావడం విశేషం.ఆఫ్రికా తరఫున గ్రాండ్‌స్లామ్ గెలిచిన మొదటి మహిళగా అవతరించాలని చూస్తున్న జబీర్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. ఆమె ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్లో కూడా సత్తా చాటింది. కానీ చివర్లో ఓటములను ఎదుర్కొంది.

తాజా ఓటమి ఆమెను మరింత బాధించక తప్పదు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి సెట్‌లో కేవలం ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే స్వియాటెక్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జబీర్ మళ్లీ పుంజుకుంది. దీంతో స్కోరు 3-2కు చేరింది. అయితే జబీర్ సర్వీస్ గేమ్‌‌లో మళ్లీ నిరాశ పరిచింది. ఇక స్వియాటెక్ 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లి 6-2తో సెట్ కైవసం చేసుకుంది.

ఇక రెండో సెట్లో ఇరువురు హోరాహోరీగా తలపడ్డారు. 4-4తో స్కోరు సమం కాగా.. మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగింది. గేమ్ 5-6పాయింట్లు 30-40 వద్ద ఉన్నప్పుడు హైడ్రామా జరిగింది. ఒక మ్యాచ్-పాయింట్‌తో పోరాడి 6-6తో మ్యాచ్ హోల్డ్ అయింది. ఇక చివరి 7-6తో సెట్ స్వియాటెక్ సెట్ గెలుపొందింది టై బ్రేక్‌లో (7/5)తో స్వియా గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది.

Story first published: Sunday, September 11, 2022, 7:55 [IST]
Other articles published on Sep 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X