'గెలిచేంత వరకు పరిగెడుతూనే ఉంటా..'

Posted By:
I'll do the running! - Federer teams up with Bill Gates for charity

హైదరాబాద్:'మ్యాచ్‌ ఫర్‌ ఆఫ్రికా' పేరిట ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రోజర్‌ ఫెడరర్‌ నిర్వహించిన చారిటీ మ్యాచ్‌కు భారీ స్పందన లభించింది. ఆఫ్రికాలోని పేద విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చేందుకు ఫెడరర్‌ ఫౌండేషన్‌ సాన్‌జోస్‌లో ఈ చారిటీ మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది.

ఈ మ్యాచ్‌ను 15,000 మంది అభిమానులు ప్రత్యక్షంగా తిలకించడంతో రూ. 16 కోట్ల 21 లక్షలు సమకూరాయి. ఈ సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ.. 36 ఏళ్ళ ఫెదరర్ తన భాగస్వామి అయిన బిల్ గేట్స్ కోసం నిత్యం పరిగెట్టగలనని పేర్కొన్నాడు. ఓ ఛారిటీకి నిధులు దానమిచ్చేందుకు గాను టెన్నిస్ పోటీని నిర్వహించారు. ప్రపంచ నంబర్ వన్ గా రెండో సంవత్సరం కూడా కొనసాగుతుండటంతో సవన్నా వేదికగా ప్రత్యర్థి జోడి జాక్‌సాక్‌తో ఆడాడు.

తన భాగస్వామి బిల్ గేట్స్‌తో కలిసి 16000 మంది అభిమానుల మధ్య ఆడిన ఫెదరర్ విజేతగా నిలిచాడు. ఈ జోడీ 6-3 పాయింట్లతో విజయాన్ని సాధించింది. జనవరిలో జరిగిన పోటీల్లో ఫెదరర్ తన కెరీర్‌లోనే 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచాడు.

ఈ గేమ్ విజయం గురించి మాట్లాడిన ఫెదరర్ 'బిల్ గేట్స్ లెక్కలు తెలిసన వ్యక్తి. బాగా గుర్తు పెట్టుకుని పాయింట్లు వచ్చే విధంగా ఆడతాడు. ఒక్కసారి కూడా అతని కారణంగా పాయింట్ పోలేదు. నేను పరిగెడుతూ ఉంటాను. ఆయన పథకం వేస్తూ ఉంటారు' అని సరాదాగా నవ్వుకున్నాడు ఫెదరర్.

సాక్ కూడా మంచి ప్లేయింగ్ మోడ్‌లోనే ఉన్నాడు. ఆట మొదలుకాక ముందు తన వైపుగా కొట్టద్దంటూ తన భాగస్వామికి చెప్పినట్లు నవ్వుతూ బదులిచ్చాడు. సరదా సరదాగా సాగిన ఈ సమరంలో బిల్ గేట్స్ ఆడుకునే కోర్టు వెనుక భాగంలో చూస్తూ ఉండగా ముందు వైపు ఫెదరర్ మోకాళ్లపై నిలుచుని ఆడి సరదాగా ముగించాడు.

Story first published: Tuesday, March 6, 2018, 16:49 [IST]
Other articles published on Mar 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి