న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2018: రఫెల్ నాదల్‌కు సులువైన డ్రా

By Nageshwara Rao
French Open 2018: John McEnroe makes surprising Rafael Nadal revelation

హైదరాబాద్: వరల్డ్ నంబర్‌వన్‌, స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సులువైన డ్రా పడింది. మే 27 ప్రారంభం కానున్న రొలాండ్‌ గారోస్‌ టోర్నీకి సంబంధించిన డ్రాను శుక్రవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో నాదల్‌, మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్‌ (హంగేరి)లకు టాప్‌ సీడింగ్స్‌ దక్కాయి.

టోర్నీలో భాగంగా రికార్డు స్థాయిలో పదకొండవ టైటిల్‌పై గురిపెట్టిన రఫెల్ నాదల్ తొలి రౌండ్‌లో డొల్గొపొలొవ్‌ (ఉక్రెయిన్‌)తో తలపడనున్నాడు. వరల్డ్ నంబర్ టు రోజర్ ఫెదరర్, బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే కూడా ఈ గ్రాండ్‌స్లామ్‌ నుంచి తప్పుకోవడంతో రఫెల్ నాదల్ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు.

మరోవైపు మాజీ ఛాంపియన్‌, సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ టోర్నీలో ఆడుతుండటంతో ఫైనల్లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది. ఇక, మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌గా ఉన్న హలెప్‌.. తొలి రౌండ్లో రిస్కె (అమెరికా)తో పోటీపడనుంది. మరోవైపు మాజీ ఛాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలో దిగుతోంది.

గతేడాది సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడునున్న సెరెనా తొలి రౌండ్లో 70వ ర్యాంకర్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో తలపడనుంది. సెరెనా ప్రిక్వార్టర్స్‌లో షరపోవాతో తలపడే అవకాశాలున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒస్తాపెంకో (లాత్వియా)తో పాటు హలెప్‌, వోజ్నియాకి, ముగురుజా ఈసారి టైటిల్‌ బరిలో ఉన్నారు.

Story first published: Saturday, May 26, 2018, 13:16 [IST]
Other articles published on May 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X