నాకుగా ఏం చెప్పను, వాళ్లు చేస్తానంటే..: ఫెదరర్(ఫొటోలు)
హైదరాబాద్: రోజర్ ఫెదరర్ పిల్లలు క్రీడల్లో రాణించాలని నొక్కి చెప్పే వాళ్లలో ముందుంటాడు. కానీ, తన వరకు వచ్చేసరికి మాత్రం లెక్క కాస్త తప్పింది. ఫెదరర్ దంపతులకు 2009లో ఒకసారి ఐదేళ్ల తర్వాత రెండోసారి రెండు జతల కవలలు పుట్టారు.

టెన్నిసే ఆడాలని:
వారిలో ఇద్దరు మగవారు కాగా ఇద్దరు ఆడపిల్లలు. వారిని ఉద్దేశించి మాట్లాడిన ఫెదరర్ తన పిల్లల్ని మాత్రం క్రీడల్ని కెరీర్‌గా ఎంచు కోవాలని బలవంతం చేయనని అన్నాడు.

మరో పాతికేళ్లు కదలకుండా:
36 ఏళ్ల ఫెడరర్ సంవత్సరాల తరబడి అలుపెరగకుండా ప్రపంచమంతా పర్యటించి టెన్నిస్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన పిల్లలు ఈ ఆటను కెరీర్‌గా మలుచుకొనేందుకు సుముఖత కనబరచడంలేదు. పిల్లల కోసం మరో పాతికేళ్లు తాను మళ్లీ ప్రపంచాన్ని చుట్టిరావాల్సి వస్తుందని భయపడుతున్నాడు.

ప్రోత్సహిస్తా..:
కానీ, ‘తండ్రిగా వారిని ప్రోత్సహిస్తానని, అయితే ఫలానాదే చేయండని మాత్రం ఆదేశించనని అంటున్నాడు. వారు క్రీడా రంగాన్ని ఎంచుకుంటారా లేదా వ్యాపారం రంగంపట్ల మొగ్గుచూపుతారా అన్నది మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తా అని పేర్కొన్నాడు.

నన్ను చూసి నేర్చుకోలేదు:
తన పిల్లలు ఇప్పటికే టెన్నిస్ ఆడుతున్నారని ఫెడెక్స్ వెల్లడించాడు. ఇందుకు తాను వారిని ఆ ఆటలో ప్రోత్సహించడంవల్ల కాదని స్పష్టంజేశాడు. వారి స్నేహితులు ఆడుతుండడమే కారణమని తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications