న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెదరర్‌పై విజయం: ఐదోసారి వింబుల్డన్ టైటిల్‌ను ముద్దాడిన జొకోవిచ్

Djokovic outlasts Federer in record-breaking epic to defend Wimbledon title

హైదరాబాద్: వింబుల్డన్‌ చరిత్రలోనే సుదీర్ఘంగా జరిగిన ఫైనల్లో సెర్బియాకు చెందిన ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ విజేతగా నిలిచాడు. సుమారు 4 గంటల 57 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌పై నొవాక్ జొకోవిచ్ 7-6 (7/5), 1-6, 7-6 (7/4), 4-6, 13-12 (7/3)తో గెలుపొందాడు.

జొకోవిచ్‌కు ఇది ఐదో వింబుల్డన్‌ టైటిల్‌ కాగా.. గడచిన 71 ఏళ్లలో మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకొని టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫెదరర్‌ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జొకోవిచ్‌ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు.

ఇక, ఫెదరర్ 61 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 94 విన్నర్లు కొట్టిన ఫెదరర్, ఆరుసార్లు డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. మరోవైపు జొకోవిచ్‌ 54 విన్నర్లు కొట్టాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఐదో టైటిల్‌ గెలిచిన జొకోవిచ్‌ ఓవరాల్‌గా 16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.

ఇదిలా ఉంటే, ఓపెన్‌ శకం మొదలైన తర్వాత టాప్‌ సీడ్, రెండో సీడ్‌ వింబుల్డన్‌ ఫైనల్లో తలపడటం ఇది 14వసారి. 2015లో సైతం ఈ ఇద్దరి మధ్య జరిగిన తుది పోరులో జొకోవిచే విజయం సాధించాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు రూ. 20 కోట్ల 26 లక్షలు... రన్నరప్‌గా నిలిచిన ఫెదరర్‌కు రూ. 10 కోట్ల 13 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.

తొలి సెట్‌ నుంచే ఇద్దరి మధ్య హోరాహోరీ

తొలి సెట్‌ నుంచే ఇద్దరి మధ్య హోరాహోరీ

తొలి సెట్‌ నుంచే ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఒక్క సెట్‌ మినహా మిగతా అన్ని సెట్లు నువ్వానేనా అన్నట్లే సాగాయి. ఇద్దరూ తమతమ సర్వీసులను నిలబెట్టుకోవడంతో 6-6తో సమంగా నిలిచారు. అయితే, టైబ్రేక్‌లో 5-5తో ఉన్న సమయంలో జొకో వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి సెట్‌ను 7-6తో సొంతం చేసుకున్నాడు.

ఫెదరర్ విజృంభించడంతో ఏకపక్షంగా

ఫెదరర్ విజృంభించడంతో ఏకపక్షంగా

కానీ, రెండో సెట్‌లో ఫెదరర్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌ హాండ్‌ షాట్లతో చెలరేగాడు. ఫెదరర్ విజృంభించడంతో అంతా ఏకపక్షంగా సాగింది. రెండు బ్రేక్‌ పాయింట్లతో పాటు తన సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో కేవలం 15 నిమిషాల్లోనే ఫెడరర్‌ 4-0తో ఆధిపత్యం చాటాడు. ప్రత్యర్థి సర్వీస్‌ ను మూడుసార్లు బ్రేక్‌ చేసిన రోజర్‌ 6-1తో అలవోకగా నెగ్గి 1-1తో సమం చేశాడు.

మూడో సెట్‌ నువ్వానేనా అన్నట్టుగా

మూడో సెట్‌ నువ్వానేనా అన్నట్టుగా

ఇక, మూడో సెట్‌లో జొకోవిచ్ గట్టిపోటీ ఇవ్వడంతో మరోసారి నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ఇద్దరూ తమతమ సర్వీసులను కోల్పోకుండా పట్టుదలతో ఆడడంతో స్కోరు 6-6తో సమమైంది. దీంతో సెట్‌ ఫలితం టైబ్రేక్‌కు దారి తీసింది. టైబ్రేక్‌లో జొకోవిచ్ వరుసగా మూడు పాయింట్లు సాధించి 3-0తో ముందజ వేసిన జొకో 5-1తో నిలిచాడు.

నాలుగో సెట్‌లో మళ్లీ ఫెదరర్‌ జోరు

నాలుగో సెట్‌లో మళ్లీ ఫెదరర్‌ జోరు

కానీ, వరుసగా మూడు పాయింట్లు సాధించిన ఫెదరర్ 4-5తో సమం చేసే విధంగా కనిపించాడు. అయితే, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా 7-4తో నెగ్గి మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో మళ్లీ ఫెదరర్‌ జోరు పుంజుకున్నాడు. ఇందులో సుదీర్ఘ ర్యాలీలు జరిగిన ప్రతీసారి ఫెడరర్‌ విన్నర్లు సంధించి సెట్‌ను గెలుపొందాడు.

ఐదో సెట్‌ హోరాహోరీగా

ఐదో సెట్‌ హోరాహోరీగా

దీంతో నిర్ణాయక ఐదో సెట్‌ హోరాహోరీగా సాగింది. ఐదో గేమ్‌లో నొవాక్‌ జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెదరర్ 3-2తో ముందజ వేశాడు. తర్వాత వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి 5-2తో నిలిచాడు. అయితే జొకోవిచ్‌ తేరుకొని ఈ గేమ్‌లో ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 8-8తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచాడు. ఆ తర్వాత టైబ్రేక్‌ నిర్వహిస్తే మళ్లీ జొకోవిచే పైచేయి సాధించి టైటిల్‌‌ను నెగ్గాడు

Story first published: Monday, July 15, 2019, 13:41 [IST]
Other articles published on Jul 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X