న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్‌ ఫైనల్: డెల్ పోత్రో Vs జొకొవిచ్, విజయం ఎవరిని వరిస్తుందో?

By Nageshwara Rao
Djokovic expecting stern test from big-match player Del Potro

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ ముగింపు దశకు చేరుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌, అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పోత్రోతో తలపడనున్నాడు. సెమీఫైనల్లో జపాన్ ఆటగాడు కై నిషికోరీని చిత్తుగా ఓడించి నొవాక్ జొకోవిచ్‌ ఫైనల్లోకి దూసుకొచ్చాడు.

యుఎస్ ఓపెన్: సెరెనా Vs ఒసాకా, చరిత్ర సృష్టించేది ఎవరు?యుఎస్ ఓపెన్: సెరెనా Vs ఒసాకా, చరిత్ర సృష్టించేది ఎవరు?

అదేవిధంగా స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడంతో డెల్ పోత్రో ఫైనల్‌కు చేరుకున్నాడు. జపాన్‌కు చెందిన నిషికోరీపై జొకొవిచ్ బ్యాక్ టు బ్యాక్ సెట్లలో విజయం సాధించాడు. తొలి సెమీఫైనల్లో జొకొవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిషికోరీ తేలిపోయాడు. మూడు వరుస సెట్లలో నెగ్గి జొకొవిచ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

నొవాక్ జొకోవిచ్ అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌ చేరడం ఇది 8వ సారి. ఇప్పటి వరకూ 7 సార్లు ఫైనల్ చేరినా రెండు సార్లు మాత్రమే జొకొవిచ్ యుఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గాడు. మరో సెమీఫైనల్లో రఫెల్ నాదల్ టోర్నీ నుంచి గాయం కారణంగా నిష్ర్కమించాడు. అర్జెంటీనా ఆటగాడు డెల్‌ పోట్రోతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో నాదల్‌ మోకాలి గాయం కారణంగా ఆటను కొనసాగించలేకపోయాడు.

ఆట మధ్యలో మోకాలి గాయంతో బాధపడ్డ నాదల్‌ తొలి రెండు సెట్లను కోల్పోయిన తర్వాత టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొలి సెట్‌ను 6-7(3/7) చేజార్చుకున్న నాదల్‌.. రెండో సెట్‌ను 2-6తో కోల్పోయాడు. తర్వాత నాదల్‌ మోకాలి గాయం మరింత ఇబ్బంది పెట్టడంతో తప్పుకున్నాడు.

యుఎస్ ఓపెన్‌లో ముగిసిన నాదల్ కథ: గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమణయుఎస్ ఓపెన్‌లో ముగిసిన నాదల్ కథ: గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమణ

అప్పటికే 7-6, 6-2‌తో రెండు సెట్లు నెగ్గిన డెల్ పోత్రో సునాయాసంగా ఫైనల్‌‌కు అర్హత సాధించాడు. 2009లో తొలిసారి యుఎస్‌ ఓపెన్‌ గెలిచిన డెల్‌ పోట్రో మరోసారి టైటిల్‌ పోరుకు సిద్దమయ్యాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నొవాక్‌ జొకోవిచ్‌తో పాట్రో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

Story first published: Saturday, September 8, 2018, 16:15 [IST]
Other articles published on Sep 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X