న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా ఓపెన్: సీనియర్ల ధాటికి చిత్తవుతున్నారు(ఫొటోలు)

హైదరాబాద్: అద్భుత ప్రదర్శనతో, అనుభవంతో రఫెల్ నాదల్ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా కుర్రాడు డిగో స్క్వాట్జ్‌మన్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయినా సరే నాదల్‌ 6-3, 6-7 (4-7), 6-3, 6-3తో విజయం సాధించి మందంజ వేశాడు. రాడ్‌లేవర్‌ ఎరీనాలో టాప్‌సీడ్‌ రఫెల్ నాదల్ మంచి జోరును ప్రదర్శిస్తున్నాడు. తొలి సెట్‌ ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నాదల్‌.. ఆపై 6-3తో సెట్‌ గెలిచాడు. రెండో సెట్లో రఫాకు స్క్వాట్జ్‌మన్‌ నుంచి ఊహించని పోరాటం ఎదురైంది.

 మారిన్ సిలిచ్‌తో పోరాడేందుకు:

మారిన్ సిలిచ్‌తో పోరాడేందుకు:

ఈ సెట్‌ ఆరంభంలో స్క్వాట్జ్‌మన్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి 4-3తో నాదల్‌ ఆధిక్యంలో నిలువగా.. ఆ వెంటనే స్క్వాట్జ్‌మన్‌ బ్రేక్‌ సాధించడంతో స్కోరు 4-4తో సమమైంది. టైబ్రేకర్‌కు మళ్లిన ఈ సెట్లో సర్వీసులతో ఆకట్టుకున్న స్క్వాట్జ్‌మన్‌.. 7-6 (7-4)తో సెట్‌ గెలుచుకున్నాడు. అక్కడ నుంచి రఫాదే జోరు. మూడో సెట్‌లో ఒకసారి, నాలుగో సెట్‌లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి అతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రఫా ఏడు ఏస్‌లతో పాటు 46 విన్నర్లు కొట్టాడు. ఈ విజయంతో నంబర్‌వన్‌ ర్యాంకును కూడా అతను నిలబెట్టుకున్నాడు. క్వార్టర్స్‌లో అతను మారిన్‌ సిలిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు సిలిచ్‌పై నాదల్‌కు 5-1తో తిరుగులేని రికార్డు ఉంది.

 పరాజయం పాలైన కారెనొ బుస్టా:

పరాజయం పాలైన కారెనొ బుస్టా:

హోరాహోరీ సాగిన మరో ప్రిక్వార్టర్స్‌లో ఆరోసీడ్‌ సిలిచ్‌ 6-7 (2-7), 6-3, 7-6 (7-6), 7-6 (7-3)తో కారెనొ బుస్టా (స్పెయిన్‌)పై నెగ్గాడు. ఈ మ్యాచ్‌లో అతను 20 ఏస్‌లతో పాటు 73 విన్నర్లు కొట్టాడు. సిలిచ్‌కు ఇది 100వ గ్రాండ్‌స్లామ్‌ విజయం కావడం విశేషం. నువ్వానేనా అన్నట్లు సాగిన మరో పోరాటంలో దిమిత్రోవ్‌ 7-6 (7-3), 7-6 (7-4), 4-6, 7-6 (7-4)తో కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా) పోరాటానికి తెరదించాడు. కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌) కూడా క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. అతను 6-7 (4-7), 7-5, 6-2, 6-3తో ఆండ్రియస్‌ సెప్పి (ఇటలీ)పై విజయం సాధించాడు.

 గంటలోనే 25 విన్నర్లు కొట్టిన రేబ్రికోవా:

గంటలోనే 25 విన్నర్లు కొట్టిన రేబ్రికోవా:

రెండో సీడ్‌ అయిన వోజ్నియాకి జోరు మీదుంది. ఆమె అలవోకగా క్వార్టర్‌ఫైనల్‌‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో వోజ్నియాకి 6-3, 6-0తో రేబ్రికోవా (స్లొవేకియా)ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గంటలోనే 25 విన్నర్లు కొట్టి ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. సురెజ్‌ నవారో (స్పెయిన్‌), మెర్టిన్స్‌ (బెల్జియం) కూడా క్వార్టర్స్‌ చేరారు. నవారో 4-6, 6-4, 8-6తో కొంటావిట్‌ (ఇస్తోనియా)పై చెమటోడ్చి గెలవగా.. మెర్టిన్స్‌ 7-6 (7-5), 7-5తో మార్టిచ్‌ (క్రొయేషియా)ను ఓడించింది. నాలుగో సీడ్‌ ఎలెనా స్వితొలినా (ఉక్రెయిన్‌) కూడా తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-3, 6-0తో అలెర్టొవా (చెక్‌ రిపబ్లిక్‌)ను చిత్తు చేసింది.

 ఆస్ట్రేలియాపై భారత్ విజయం:

ఆస్ట్రేలియాపై భారత్ విజయం:

డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో లియాండర్‌ పేస్‌-పూరవ్‌ రాజా 1-6, 2-6తో జువాన్‌ సెబాస్టియన్‌-రాబర్ట్‌ ఫరా (కొలంబియా) చేతిలో పరాజయం పాలయ్యారు. రెండేసిసార్లు భారత జోడీ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జువాజ్‌ జంట సులభంగా విజయాన్ని సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్న శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో బోపన్న-బబోస్‌ (హంగేరి) 6-2, 6-4తో పెరెజ్‌-విటింగ్టన్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 12:00 [IST]
Other articles published on Jan 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X