న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా ఓపెన్: మిగిలిన నలుగురిలోనే సమరం

హైదరాబాద్: ఆస్టేలియన్‌ ఓపెన్‌లో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. తొలి రౌండ్ నుంచి సెమీస్ వరకు ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా దూసుకెళ్తున్నాడు ఈ స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. తనకు కలిసొచ్చిన హార్డ్ కోర్టులో 20వ టైటిల్ దిశగా కదులుతున్నాడు.

టెన్నిస్‌ చరిత్రలోనే తొలిసారిగా:

టెన్నిస్‌ చరిత్రలోనే తొలిసారిగా:

ఇప్పటివరకు 19 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఫెదరర్‌ రికార్డుల్లో నిలిచాడు. దక్షిణ కొరియా టెన్నిస్‌ చరిత్రలోనే తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన చంగ్‌ మధ్య సెమీస్‌ జరగబోతోంది. వీళ్లిద్దరూ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌ దాటారు. బుధవారం క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ ఫెదరర్‌ 7-6 (7-1), 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో 19వ సీడ్‌ థామస్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాడు.

ఫెదరర్‌ జోరు మొదలైంది:

ఫెదరర్‌ జోరు మొదలైంది:

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫెదరర్‌ సెమీస్‌ చేరడమిది 14వ సారి. క్వార్టర్స్‌ మ్యాచ్‌ తొలిసెట్‌ హోరాహోరీగా సాగింది. బెర్డిచ్‌ వరుసగా మూడు గేమ్‌లు సాధించి 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 5-3తో సెట్‌ విజయానికి చేరువగా వెళ్లాడు. ఐతే ఇక్కడే ఫెదరర్‌ జోరు మొదలైంది.

రెండో సెట్లో ఫెదరర్‌ ధాటికి:

రెండో సెట్లో ఫెదరర్‌ ధాటికి:

గొప్పగా పుంజుకున్న ఫెదరర్‌ బెర్డిచ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి.. తన సర్వీస్‌లు నిలబెట్టుకుని సెట్‌ను ట్రైబేకర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తనదైన ఆధిపత్యంతో సెట్‌ గెలిచాడు. రెండో సెట్లో ఫెదరర్‌ ధాటికి బెర్డిచ్‌ నిలవలేకపోయాడు. 3-6తో సెట్‌ చేజార్చుకున్నాడు. మూడో సెట్‌లో కొంచెం ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఫెదరర్‌ పట్టు వదల్లేదు.

ప్రిక్వార్టర్స్‌లో జోకోవిచ్‌కు షాకిచ్చి:

ప్రిక్వార్టర్స్‌లో జోకోవిచ్‌కు షాకిచ్చి:

జ్వెరెవ్‌, జకోవిచ్‌ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడిస్తూ క్వార్టర్స్‌ చేరిన అన్‌సీడెడ్‌ ఆటగాడు చంగ్‌.. తన జైత్రయాత్రను కొనసాగించాడు. ప్రిక్వార్టర్స్‌లో జోకోవిచ్‌కు షాకిచ్చిన అతను క్వార్టర్స్‌లో 6-4, 7-6, (7-5), 6-3తో అమెరికా యువ ఆటగాడు సాండ్‌గ్రిన్‌ (అమెరికా)పై విజయం సాధించాడు.

 టైబ్రేకర్‌కు దారి తీసింది:

టైబ్రేకర్‌కు దారి తీసింది:

తొలిసెట్‌ను సులువుగానే గెలుచుకున్న చంగ్‌.. రెండో సెట్లో కష్టపడాల్సి వచ్చింది. రెండో సెట్‌ హోరాహోరీగా సాగి టైబ్రేకర్‌కు దారి తీసింది. టైబ్రేకర్‌లో చంగ్‌ 7-5తో గెలిచాడు. మూడో సెట్లో ధాటిగా ఆడిన అతను సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

కెర్బర్‌, హలెప్‌ సైతం..:

కెర్బర్‌, హలెప్‌ సైతం..:

మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ హలెప్‌, మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ సెమీస్‌ చేరారు. క్వార్టర్స్‌లో కెర్బర్‌ 6-1, 6-2తో మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై సునాయస విజయం సాధించింది. హలెప్‌ 6-3, 6-2తో ఆరో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను చిత్తు చేసింది. సెమీస్‌లో హలెప్‌, కెర్బర్‌లే తలపడనున్నారు.

మిక్స్‌డ్ సెమీస్‌లో బోపన్న జోడీ:

మిక్స్‌డ్ సెమీస్‌లో బోపన్న జోడీ:

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మిగిలిన ఏకైక భారత క్రీడాకారుడు రోహన్‌ బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీస్‌ చేరాడు. బోపన్న-బాబోస్‌ (హంగేరీ) జోడీ క్వార్టర్స్‌లో 6-4, 7-6 (7-5)తో స్పియర్స్‌ (యుఎస్‌)- కబాల్‌ (కొలంబియా) జంటపై గెలిచింది. గంటా 15 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను సులభంగా గెలుచుకున్న బోపన్న జోడీ.. రెండో సెట్లో చెమటోడాల్సి వచ్చింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 25, 2018, 10:23 [IST]
Other articles published on Jan 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X