న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian Open 2021: థీమ్‌కు షాక్‌.. జొకోవిచ్‌ 300! మార్గరెట్‌ రికార్డుపై కన్నేసిన సెరెనా!

Australian Open 2021: Dominic Thiem stunned by Grigor Dimitrov, Serena defeats Sabalenka

మెల్‌బోర్న్‌: యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌, ఆస్ట్రియా యువ ఆటగాడు డొమినిక్‌ థీమ్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో షాక్‌ తగిలింది. 18వ సీడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) చేతిలో వరుస సెట్లలో థీమ్ అనూహ్య పరాజయంను ఎదుర్కొన్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ థీమ్‌ 4-6, 4-6, 0-6తో దిమిత్రోవ్‌ చేతిలో ఓడిపోయాడు. తొలి రెండు సెట్లలో కాస్త పోరాటం చేసిన థీమ్‌.. మూడో సెట్లో పూర్తిగా తేలిపోయాడు. మూడో సెట్లో అతడు ఒక్క గేమ్‌ కూడా గెలవలేకపోయాడు. శారీరక సమస్యల వల్ల 100 శాతం ప్రదర్శన చేయలేకపోయానని మ్యాచ్‌ అనంతరం థీమ్‌ చెప్పాడు.

 ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్‌ టెండూల్కర్‌ మెరుపులు.. ఒకే ఓవర్‌లో అయిదు సిక్సర్లు!! ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్‌ టెండూల్కర్‌ మెరుపులు.. ఒకే ఓవర్‌లో అయిదు సిక్సర్లు!!

డిఫెండింగ్‌ చాంపియన్, వరల్డ్‌ నంబర్‌వన్‌ నోవాక్ జొకోవిచ్‌ (సెర్బియా) గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో 300వ విజయాన్ని నమోదు చేశాడు. స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్‌ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో టాప్‌సీడ్‌ జకోవిచ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 7-6 (7-4), 4-6, 6-1, 6-4తో రోనిచ్ (కెనడా)‌ను ఓడించాడు. ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), క్వాలిఫయర్‌ అస్లాన్‌ కరాట్సెవ్‌ (రష్యా) కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. జ్వెరెవ్‌ 6-4, 7-6 (7-5), 6-4తో లజోవిచ్‌ (సెర్బియా)ను ఓడించగా.. అస్లాన్‌ 3-6, 1-6, 6-3, 6-3, 6-4తో ఫిలిక్స్‌ అగర్‌ (కెనడా)పై విజయం సాధించాడు.

మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిళ్లు) అత్యధిక టైటిళ్ల రికార్డును సమం చేసే దిశగా అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ దూసుకెళుతోంది. మహిళల సింగిల్స్‌లో సెరెనా క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో పదోసీడ్‌ సెరెనా 6-4, 2-6, 6-4తో ఏడోసీడ్‌ సబలెంక (బెలారస్‌)ను ఓడించింది. రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ 3-6, 6-1, 6-4 తేడాతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌పై గెలిచి, సెరెనాతో క్వార్టర్స్‌కు సిద్ధమైంది.

జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకా కూడా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో తడబడ్డా నిలబడింది. ఒసాకా 4-6, 6-4, 7-5తో ముగురుజ (స్పెయిన్‌)ను ఓడించింది. ఈ పోరులో ఆమె పదకొండు ఏస్‌లతో పాటు 40 విన్నర్లు కొట్టింది. ఇంకోవైపు చైనీస్‌ తైపీ కెరటం సువీయ్‌ తన సంచలనాల పర్వాన్ని కొనసాగిస్తూ.. తుది ఎనిమిదిలో చోటు సంపాదించింది. ప్రిక్వార్టర్స్‌లో సువీయ్‌ 6-4, 6-2తో 19వ సీడ్‌ వోండ్రుసోవాను ఓడించింది. మహిళల డబుల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ గెలిచిన సె సువె సింగిల్స్‌ విభాగంలో మాత్రం తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

Story first published: Monday, February 15, 2021, 8:33 [IST]
Other articles published on Feb 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X