న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాదల్‌కు షాక్: గోఫిన్ చేతిలో ఓటమి, టోర్నీ నుంచి నిష్క్రమణ

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌కు ప్రత్యర్థి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. దాదాపు రెండున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ రఫెల్ నాదల్

By Nageshwara Rao
ATP Finals: Rafael Nadal ends season after defeat by David Goffin

హైదరాబాద్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌కు ప్రత్యర్థి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. దాదాపు రెండున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ రఫెల్ నాదల్ ఓడిపోయాడు.

మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఏడోసీడ్ డేవిడ్ గోఫిన్ (బెల్జియం) 7-6 (7/5), 6-7 (4/7), 6-4తో చేతిలో రఫెల్ నాదల్ ఓటమి పాలయ్యాడు. అంతేకాదు కుడి మోకాలి గాయం కారణంగా రఫెల్ నాదల్ ఈ టోర్నీ నుంచే తప్పుకున్నాడు.

పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేకుండానే బరిలోకి దిగిన నాదల్, మ్యాచ్ సందర్భంగా కోర్టులో చాలాసార్లు నొప్పికి గురయ్యాడు. దీంతో గోఫిన్ తనకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థి అయినా అతను కొట్టిన సర్వీస్‌కు సరైన రీతిలో బదులు ఇవ్వలేకపోయాడు.

ఇదిలా ఉంటే తన కెరీర్‌లో 16 గ్రాండ్‌స్లామ్‌లతో కలిపి మొత్తం 75 సింగిల్స్ టైటిల్స్‌ను గెలిచిన రఫెల్ నాదల్ తన కెరీర్‌లో ఒక్కసారి కూడా ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను సాధించలేక పోవడం విశేషం. గతంలో మూడు సార్లు ఫైనల్‌కు చేరుకున్నా రన్నరప్‌గా నిలిచాడు.

కాగా, గాయం కారణంగా ఏటీపీ వరల్డ్ టూర్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన నాదల్ చెప్పాడు. వచ్చే ఏడాది మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 15, 2017, 13:45 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X