న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె తోడుతోనే ఈ స్థాయికి చేరుకున్నా

By Subhan
After Australian Open triumph, Federer credits wife Mirka for keeping him going

హైదరాబాద్: టెన్నీస్ కెరీర్‌లో ఆదివారం గెలుచుకున్న ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌తో ఇప్పటికీ 20 టైటిళ్లు పూర్తి చేసుకున్న ఫెదరర్ సతీమణిని తెగ పొగిడేస్తున్నాడు. తాను టెన్నిస్‌లో కొనసాగుతున్నానంటే కారణం భార్య మిర్కా వల్లేనని స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ అంటున్నాడు.

ఆమె అండగా లేకుంటే ఇక్కడిదాకా వచ్చేవాడిని కాదని. నాతో మిర్కా ప్రయాణించినంత కాలం తాను టెన్నిస్‌ ఆడతానని అతనన్నాడు. ''గత 12 నెలలల్లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించాను. నమ్మబుద్ధి కావట్లేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి కెరీర్‌లో 20వ టైటిల్‌ సాధించా. అసలు 20 టైటిళ్లు సాధిస్తానని ఊహించనే లేదు. టైటిల్‌ను నిలబెట్టుకుంటానని అస్సలు అనుకోలేదు.

ఇదే జోరు కొనసాగించాలంటే షెడ్యూల్‌ జాగ్రత్తగా చూసుకోవాలి. టోర్నీల ప్రణాళిక విషయంలోనే శ్రద్ధ తీసుకోవాలి. నా భార్య మిర్కా ఈ విషయంలో ఎంతో మద్దతు ఇస్తుంది. ఏ టోర్నీ ఆడాలి.. ఏది ఆడకూడదో తనకు బాగా తెలుసు. మిర్కా, నా తల్లిదండ్రుల అండగా ఉన్నారు కాబట్టే ఇంకా టెన్నిస్‌లో కొనసాగగలుతున్నా. ముఖ్యంగా మిర్కా నాతో ప్రయాణించినంత కాలం టెన్నిస్‌ ఆడతా'' అని రోజర్‌ చెప్పాడు.

నెంబర్ వన్‌కు చేరిపోయినట్టే:
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన రోజర్‌ ఫెదరర్‌ నెమ్మదిగా నంబర్‌వన్‌ ర్యాంకుకు చేరువవుతున్నాడు. సోమవారం ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో ఫెదరర్‌ 9605 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉన్నాడు. అతనికి అగ్రస్థానంలో ఉన్న రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌, 9760)కు మధ్య తేడా 155 పాయింట్లు మాత్రమే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 10:06 [IST]
Other articles published on Jan 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X