న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు!: వరల్డ్ రికార్డు హోల్డర్, ఎవరీ అంకిత శ్రీవాత్సవ

World record holder, live liver donor, entrepreneur…. Ankita Shrivastava shows impossible is nothing


హైదరాబాద్: వరల్డ్ రికార్డు హోల్డర్, ప్రత్యక్ష కాలేయ దాత, పారిశ్రామికవేత్త, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ మరియు పబ్లిషర్... ఇదంతా కేవలం ఆమె 26 సంవత్సరాల వయసులోనే సాధించారు. ఆమె ఎవరో కాదు అంకిత శ్రీవాత్సవ. ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన ప్రపంచ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌లో లాంగ్ జంప్, బాల్ త్రోలో వరల్డ్ రికార్డు సాధించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అంకిత తన తల్లికి 74 శాతం కాలేయాన్ని దానం చేసింది. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఈ పనిచేశారు. ప్రపంచ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌ లాంగ్ జంప్‌, త్రోబాల్‌లో రెండు బంగారు పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన అంకిత, 100 మీటర్ల స్ప్రింట్‌లో రజతం సాధించారు.

World record holder, live liver donor, entrepreneur…. Ankita Shrivastava shows impossible is nothing

2014లో కాలేయ దానం చేసిన తర్వాత రెండు నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు. యాదృచ్ఛికమో ఏమో తెలియదు గాను... దేశంలో కాలేయ దానం చేసిన అతి పిన్న వయస్కురాలు అంకితనే. ఏదేమైనా ఆమె పట్టుదలే తిరిగి ఆటలోకి తీసుకువచ్చేలా చేసింది. ఇందుకోసం ఆమె రోజుకు చాలా గంటలు కష్టపడింది.

ఇతరుల మాదిరిగానే ప్రతిదీ చేసేందుకు నిబద్ధత మరియు అంకితభావం కలిగి ఉండాలి. భోపాల్ నుండి వచ్చిన ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాకారంతోనే ఈ ఘనతను సాధ్యం చేశారు. ప్రపంచ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌ ఫేడరేషన్‌లో 59 వివిధ దేశాల నుండి 2,027 మంది పాల్గొన్నారు. భారతదేశం గెలిచిన 6 పతకాల్లో అంకిత 3 పతకాలు నెగ్గి దేశం గర్వించేలా చేశారు.

World record holder, live liver donor, entrepreneur…. Ankita Shrivastava shows impossible is nothing

అయితే, అంకిత ఇక్కడే ఆగిపోలేదు. ఆమె ఒక పారిశ్రామికవేత్త, 19 ఏళ్ల వయసులోనే రచయితగా పలు పుస్తకాలను ప్రచురించారు. నేషనల్ స్విమ్మర్ మరియు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిన అంకిత శ్రీవాత్సవ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చేరారు.

దీంతో పాటు సెంట్రల్ ఇండియాలో అతిపెద్ద ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ యూనిట్ అయిన ఆదర్ష్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆమె తన కుటుంబంతో కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. బార్బీ, బెన్ 10, డిస్నీ లాంటి వాటికి ఈ సంస్థ ప్రింటింగ్ లైసెన్సింగ్ ఏజెంట్‌గా ఉంది. వారు అభివృద్ధి చేసిన మేధో సంపత్తి పర్పుల్ తాబేలు దాని విద్యా విషయాల ద్వారా 29కి పైగా దేశాలకు చేరుకుంది.

World record holder, live liver donor, entrepreneur…. Ankita Shrivastava shows impossible is nothing

భారతదేశం, నేపాల్‌లలో కూడా 14 ప్రీ స్కూల్స్ ఉన్నాయి. యానిమేషన్ సిరీస్ 52 x7 '2Dకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. దేశవ్యాప్తంగా చాలా సామాజిక కారణాలకు అంకిత బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. DSYW, CII's భారత మహిళా నెట్‌వర్క్‌లో గౌరవ సభ్యురాలుగా ఉన్నారు.

Story first published: Monday, November 18, 2019, 17:39 [IST]
Other articles published on Nov 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X