వింటర్ ఒలింపిక్స్‌: తొలి డోపీగా తేలిన క్రీడాకారుడు ఎవరో తెలుసా?

Posted By:
Winter Olympics 2018: Japan's Saito suspended for doping

హైదరాబాద్: దక్షిణకొరియాలోని ప్యాంగ్ నగరంలో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో తొలి డోపింగ్ కేసు నమోదైంది. జపాన్‌కు చెందిన షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఆటగాడు కై సైటో డోప్ పరీక్షల్లో దొరికిపోయాడు. 21 ఏళ్ల కై సైటోకు పరీక్షలు నిర్వహించగా నిషేధిత పదార్థాలు తీసుకున్నట్లు వెల్లడైందని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్) మంగళవారం పేర్కొంది.

మరిన్ని వింటర్ ఒలింపిక్స్ వార్తల కోసం

పోటీలకు ముందుగా నిర్వహించిన టెస్టులో అతడు డోపీగా తేలడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు యాంటీ డోపింగ్ అథారిటీ తెలిపింది. నిషేధిత పదార్థాల జాబితాలో ఉన్న అసిటాలోజమైడ్‌ను అతడు తీసుకున్నట్లు పేర్కొంది. ప్యాంగ్ చాంగ్ నగరంలోని ఒలింపిక్ క్రీడాగ్రామాన్ని అతడు స్వచ్ఛందంగానే విడిచివెళ్లాడని తెలిపింది.

దీంతో అతడిపై వింటర్ ఒలింపిక్స్‌లో ఏ పోటీలోనూ పాల్గొనకుండా తాత్కాలికంగా నిషేధం విధించామని దర్యాప్తు కొనసాగిస్తామని సీఏఎస్ వెల్లడించింది. కై సైటో బయాలజీ స్టూడెంట్. అతడితో పాటు అతని సోదరి హితోమి కూడా వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటొంది. కాగా, వింటర్ ఒలింపిక్స్‌లో డోపీగా తొలి జపాన్ అథ్లెట్‌గా కై సైటో నిలిచాడు.

కై సైటో డోపీగా తేలడంతో మంగళవారం ప్యాంగ్ చాంగ్‌లో జపాన్ ఒలింపిక్ కమిటీ అధికారక మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో ఈ డోపింగ్ అంశం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశాయని పేర్కొన్నారు. కాగా, 2020లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్‌కు జపాన్ ఆతిథ్యమిస్తోన్నసంగతి తెలిసిందే.

2013, 2014లో జరిగిన వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో 3,000 మీటర్ల రిలే టీమ్ విభాగంలో సై కైటో మూడో స్థానంలో నిలిచాడు. తాజాగా ఆతడు డోపీగా తేలడంపై మాట్లాడుతూ పరీక్షలో వచ్చిన ఫలితాలు చూసి తానెంతో ఆశ్చర్యపోయానని, అయితే కావాలని మాత్రం నిషేధిత డ్రగ్స్ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 14:58 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి