న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాకు ఖేల్‌రత్న ఎందుకివ్వలేదు?: కోర్టుకు వెళ్లే ఆలోచనలో పూనియా, ఆగ్రహం

Why Deny Me A Khel Ratna?; Bajrang Punia Threatens To Move Court

హైదరాబాద్: అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న దక్కకపోవడంపై స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ అంశంలో ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న భజరంగ్ ఈ ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు.

దీంతో భజరంగ్ పేరును భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ రాజీవ్‌ ఖేల్‌ రత్నకు సిఫారసు చేసింది. అయితే, గురువారం కేంద్ర ప్రభుత్వం అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రభుత్వం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానులకు ఆ అవార్డును ప్రకటించింది.

స్పోర్ట్స్ అవార్డులు 2018: కోహ్లీకి ఖేల్ రత్న, సిక్కీ రెడ్డికి అర్జున అవార్డుస్పోర్ట్స్ అవార్డులు 2018: కోహ్లీకి ఖేల్ రత్న, సిక్కీ రెడ్డికి అర్జున అవార్డు

దీంతో ఆవేదనకు గురైన భజరంగ్ శుక్రవారం క్రీడా మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ను బజరంగ్‌ కలవనున్నాడు. దీనిపై భజరంగ్ మాట్లాడుతూ "ఈ నిర్ణయం నన్ను విస్మయానికి గురిచేసింది. నిరాశలో కూరుకుపోయాను. యోగి భాయ్‌ (యోగేశ్వర్‌ దత్‌)తో మాట్లాడిన అనంతరం క్రీడల మంత్రితో సమావేశమవుతా" అని అన్నాడు.

"నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ ఏడాది ఈ పురస్కారానికి నేను అర్హుడిగా భావిస్తున్నా. అందుకే ఈ అంశంపై మాట్లాడుతున్నా. అవార్డులు అడుక్కోవడం కాదు. కానీ, ఓ క్రీడాకారుడిగా ఖేల్‌రత్న అందుకోవడం చాలా పెద్ద గౌరవం" అని భజరంగ్ పూనియా తెలిపాడు.

Story first published: Friday, September 21, 2018, 9:07 [IST]
Other articles published on Sep 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X