కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం: ఎవరీ మీరాబాయి చాను?

Posted By:
Who is Mirabai Chanu?

హైదరాబాద్: మీరాబాయి చాను... గురువారం సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పేరు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతోన్న 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన మహిళా వెయిట్‌లిప్టర్. దీంతో ఎవరీ మీరాబాయి చాను అని ప్రతి ఒక్కరూ గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.

మీరాబాయి చాను మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణి. గురువారం ప్రారంభమైన కామన్వెల్త్ పోటీల్లో చాను అద్భుత ప్రదర్శన చేసింది. అంతేకాదు స్వర్ణ పతకం సాధించే క్రమంలో మూడు కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను బద్దలు కొట్టింది. స్నాచ్, పుల్లింగ్, లిప్ట్‌ల్లో చాను కామెన్‌వెల్త్ రికార్డును సృష్టించింది.

గోల్డ్ కోస్ట్‌లో స్వర్ణం గెలిచిన చాను

గోల్డ్ కోస్ట్‌లో స్వర్ణం గెలిచిన చాను

చాను తన మూడు ప్రయత్నాల్లో 80, 84, 86 కేజీల బరువును ఎత్తడం విశేషం. గురువారం జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో చాను మొత్తం 196 కేజీలు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకోగా.. మారిషస్‌కు చెందిన హనిత్రా(170కేజీలు) రజతం గెలుచుకోగా, శ్రీలంకకు చెందిన దినూష(155) కాంస్యంతో సరిపెట్టుకుంది.

 గ్లాస్గోలో రజత పతకంతో వెలుగులోకి

గ్లాస్గోలో రజత పతకంతో వెలుగులోకి

2014 గ్లాస్గో వేదికగా జరిగిన కామెన్వెల్త్‌ గేమ్స్‌లో 48 కేజీల కేటగిరీలో రజత పతకం సాధించింది. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. తద్వారా రెండు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు

కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు

ఈ విజయంతో మణిపూర్ ప్రభుత్వం ఆమెను ఘనంగా సత్కరించడంతో పాటు ఆమెకు రూ.20 లక్షల చెక్ ఇచ్చి సత్కరించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చాను ప్రదర్శనకు గాను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకుంది. అయితే, 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రం చాను విఫలమైంది.

ఆ వ్యాఖ్యలతో చాలా కుంగిపోయా

ఆ వ్యాఖ్యలతో చాలా కుంగిపోయా

రియో ఒలింపిక్స్ విఫలంపై తాజాగా మీరాబాయి చాను మాట్లాడుతూ తాను చాలా కుంగిపోయానని, మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. పూర్తిగా క్రీడల నుంచే తప్పుకుందామనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. అంతేకాదు తనను, తన కోచ్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ తనను తీవ్రంగా బాధించాయని తెలిపింది.

చాను ఇంట్లో సంబరాలు

తనపై వచ్చిన విమర్శలకు ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో సాధించిన స్వర్ణ పతకమే సమాధానమని చెప్పింది. తన తర్వాతి లక్ష్యం 2020 ఒలింపిక్స్ అని ఆమె స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే గోల్డ్ కోస్డ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడంతో మణిపూర్‌లోని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాలు చేసుకుంటున్నారు.

Story first published: Thursday, April 5, 2018, 18:37 [IST]
Other articles published on Apr 5, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి