న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​​పై నిషేధం.. సోనమ్‌కు నోటీసులు!!

WFI Temporarily Suspends Vinesh Phogat For Indiscipline in Tokyo Olympics 2021

ఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్ల‌ర్ వినేష్ పోగాట్‌కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్​ఐ) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. తాజాగా జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్​ 2020 శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకు డబ్ల్యూఎఫ్ ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు ఆగస్టు 16 వరకు వినేశ్ ఫొగాట్​కు గడువు ఇచ్చింది. దుష్ప్రవర్తనకు గానూ మరో యువ రెజ్లర్ సోనమ్​​​కు కూడా డబ్ల్యూఎఫ్​ఐ​ నోటీసులు జారీ చేసింది.

కొత్త క్లబ్​తో లియోనెల్ మెస్సీ ఒప్పందం! ఛలో పారిస్!!కొత్త క్లబ్​తో లియోనెల్ మెస్సీ ఒప్పందం! ఛలో పారిస్!!

'వినేశ్ పోగాట్‌ తప్పు చేసింది. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో చాలా అమర్యాదగా ప్రవర్తించింది. అందుకే ఆమెపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాం. ఈ విషయంపై వివరణ ఇచ్చే వరకు ఏ విధమైన పోటీల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. ఇది క్షమించాల్సిన విషయం ఏమాత్రం కాదు. సీనియర్​ రెజ్లర్లు ప్రవర్తించాల్సిన విధానం ఇది కాదు. ఇదే మా చివరి నిర్ణయం' అని భారత రెజ్లింగ్​ సమాఖ్య (డబ్ల్యూఎఫ్​ఐ) మంగళవారం పేర్కొంది. మెగా క్రీడల్లో రెజ్లర్లు ఏమి సాధించలేదు కానీ స్టార్​ రెజ్లర్లమని ఫీల్ అయ్యారు, తాము ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారంది.

మరో అథ్లెట్​ సోనమ్​​కు కూడా భారత రెజ్లింగ్ సమాఖ్య నోటీసులు జారీ చేసింది. టోక్యో 2020కు చేరుకోవడానికి ముందు ​డబ్ల్యూఎఫ్​ఐ కార్యలయానికి వెళ్లి పాస్​పోర్ట్​ తీసుకోవాల్సి ఉండగా సోనమ్​ నిరాకరించింది. ఆ పని చేయాల్సింది స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​) అధికారులని పేర్కొంది. దాంతో ఆమెపై కూడా చర్యలు తీసుకోనుంది. రెజ్లింగ్​ సమాఖ్య తమ అథ్లెట్లను ఎందుకు నియంత్రించలేకపోతుందనే విషయంపై వివరణ ఇవ్వాలంటూ భారత ఒలింపిక్​ సంఘం (ఐఓఏ) డబ్ల్యూఎఫ్​ఐకి నోటీసులు జారీ చేసింది. దీంతో చేసేదేమి లేక వీరిద్దరిపై డబ్ల్యూఎఫ్ఐ చర్యలు తీసుకుంది.

ఒలింపిక్స్​ 2020కు ముందు 'వినేశ్ పోగాట్‌ శిక్షణ కోసం కోచ్​ వోల్లర్​ అకోస్​తో కలిసి హంగేరీకి వెళ్లింది. అక్కడి నుంచి నేరుగా టోక్యోకు చేరుకుంది. భారత అథ్లెట్లు సోనమ్​, అన్షు మాలిక్, సీమా బిస్లా ఉన్న ప్రాంతంలోనే ఆమెకు గదిని కేటాయించారు. అయితే అక్కడ ఉండటానికి వినేశ్​ నిరాకరించింది. వారంతా భారత్ నుంచి వచ్చారని. వారికి కరోనా​ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్​ చేసే శిబిరం దగ్గర శిక్షణ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపలేదు​. ఆమె పాల్గొన్న మ్యాచ్​ల్లోనూ అధికారిక స్పాన్సర్​ జెర్సీని కాకుండా వేరేది ధరించింది. చివరికి పేలవ ఆటతో సెమీస్​లోనే నిష్క్రమించింది. ​

Story first published: Tuesday, August 10, 2021, 20:42 [IST]
Other articles published on Aug 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X