న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తప్పుడు డోపింగ్‌ ఫలితాలు.. రష్యాపై నాలుగేళ్ల నిషేధం!!

WADA Seeks Four-year Russia Ban Over False Doping Data

మాస్కో: ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించాలని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు సిఫార్సు చేసింది. మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు డోపింగ్‌ పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన వాడా స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఆ మేరకు నిషేధాన్ని సూచించింది. దీంతో అంతర్జాతీయ క్రీడల్లో మరో నాలుగేళ్ల పాటు రష్యా అథ్లెట్లు కనిపించకపోయే అవకాశం ఉంది.

ప్రేమ సాగరంలో అన్యోన్యంగా ప్రయాణిస్తున్నాం.. అనుష్కతో కోహ్లీ ట్రెక్కింగ్!!ప్రేమ సాగరంలో అన్యోన్యంగా ప్రయాణిస్తున్నాం.. అనుష్కతో కోహ్లీ ట్రెక్కింగ్!!

నిషేధం అమలయితే.. రష్యా ఆటగాళ్లు పాల్గొనకుండా చేయడంతో పాటు రష్యా అంతర్జాతీయ పోటీల ఆతిథ్యానికి బిడ్‌ వేసే అవకాశముండదు. ఇదే జరిగితే యూరో 2020 ఈవెంట్‌ను ఈసారి ఉమ్మడిగా నిర్వహిస్తున్నప్పటికీ.. ఇందులో రష్యాకు చెందిన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వేదిక కూడా ఉండటం ఫుట్‌బాల్‌ వర్గాలను కలవరపెడుతున్నాయి.

రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ) చీఫ్‌ యూరీ గానస్‌ మాట్లడుతూ...'నిషేధం అమలయ్యే అవకాశం ఉంది. నాలుగేళ్ల పాటు ఆటలకు దూరమవక తప్పేలా లేదు. నిషేధం కారణంగా టోక్యో ఒలింపిక్స్‌ (2020), బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ (2022) మెగా ఈవెంట్లలో రష్యా పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు' అని పేర్కొన్నారు. 2015లో రష్యాలో వ్యవస్థీకృత డోపింగ్‌ వ్యవహారం అంతర్జాతీయ క్రీడా సమాజంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.

క్రీడాధికారులు, కోచ్‌లు తమ క్రీడాకారులకు శిక్షణతో పాటు నిషేధిత ఉ్రత్పేరకాలు అలవాటు చేస్తున్నట్లు తేలడంతో వాడా విచారణకు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. అధికారుల అండతోనే ఇదంతా జరిగిందని కమిటీ విచారణలో తేలడంతో.. రష్యా నిషేధానికి గురయింది. డోపీలపై నిషేధం విధించడం సర్వసాధారణం. కానీ.. ఇక్కడ అధికారగణం ప్రోద్బలంతోనే ఇదంతా జరగడంతో ఏకంగా రష్యానే నిషేధించాల్సిన పరిస్థితి వచ్చింది.

Story first published: Wednesday, November 27, 2019, 17:23 [IST]
Other articles published on Nov 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X