న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలి నగరంగా విశాఖపట్నం: సాగరతీరంలో బీచ్ వాలీబాల్ పోటీలు

Visakhapatnam to host Beach Volleyball World Tour

హైదరాబాద్: విశాఖపట్నం తొలిసారిగా ఓ అంతర్జాతీయ క్రీడల పోటీలకు వేదికగా నిలుస్తోంది. భారత్‌లో తొలిసారిగా జరగబోయే ప్రపంచ టూర్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ప్రపంచ టూర్‌ బీచ్‌ వాలీబాల్‌ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న భారత తొలి నగరంగా విశాఖపట్నం రికార్డు సాధించనుంది.

<strong>ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీని చూశారా? (వీడియో)</strong>ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీని చూశారా? (వీడియో)

విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో బుధవారం ఆరోంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. బుధవారం(ఫిబ్రవరి 28) నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో పురుషులు, మహిళల విభాగాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో 23 దేశాలకు చెందిన 56 జట్లు ప్రాతినిథ్యం వహించనున్నాయి.

భారత్ నుంచి ఐదు జట్లు

భారత్ నుంచి ఐదు జట్లు

భారత్‌ తరఫున పురుషులు, మహిళల విభాగాలలో ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ప్రపంచ టూర్‌లో భాగంగా ఆసియా ఆరు టోర్నీలకు ఆతిథ్యమివ్వనుంది. అందులో రెండో టోర్నీ వైజాగ్‌లో జరగనుంది. తొలి టోర్నీ గత వారం కంబోడియాలో ముగిసింది. అంతర్జాతీయ వాలీబాల్‌ టోర్నీకి చివరగా భారత్‌లో 2010లో చెన్నైలో జరిగింది.

భారత్‌లో ఇదే తొలిసారి

భారత్‌లో ఇదే తొలిసారి

అయితే, ప్రపంచ టూర్‌ టోర్నీ భారత్‌లో జరగనుండటం ఇదే తొలిసారి. ప్రపంచ వాలీబాల్‌ సమాఖ్య నిబందనల మేరకు ప్రత్యేకమైన ఇసుకతో ఇక్కడ తాత్కాలిక కోర్టుల్ని ఏర్పాటు చేశారు. దాంతో విశాఖ క్రీడాభిమానులకు బికినీలతో బీచ్‌ వాల్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారిణుల ఆట కనువిందు చేయనుంది.

పోటీల్లో పాల్గొనే జట్లు 27న విశాఖకు

పోటీల్లో పాల్గొనే జట్లు 27న విశాఖకు

ఈ బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే జట్లు 27న విశాఖకు చేరుకుంటాయి. 28న క్వాలిఫయింగ్‌ రౌండ్‌ పోటీలుంటాయి. మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన జట్లు 28న విశాఖ చేరుకుంటాయి. మెయిన్‌ డ్రా టోర్నీ మార్చి1 నుంచి 3 వరకు ఉంటుంది. మార్చి 2న క్వార్టర్‌ ఫైనల్స్, సెమీఫైనల్స్‌ జరుగుతాయి. మార్చిన 3న పురుషులు, మహిళల విభాగాలలో ఫైనల్స్ ఉంటాయి.

టికెట్ కనీస ధర రూ.5 నుంచి

టికెట్ కనీస ధర రూ.5 నుంచి

బీచ్ వాలీబాల్ పోటీలు వీక్షించడానికి నిర్వాహకులు కనీస ధర రూ.5 కాగా రూ.750 టిక్కెట్లు కూడా వీక్షకుల కోసం అందుబాటులో ఉంచారు. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా రెండు వేల టిక్కెట్లను ఆన్‌లైన్‌‌లో టిక్కెట్‌జెనీ.ఇన్‌ వెబ్‌ సైట్‌లో ఉంచారు. అంతేకాదు అన్ని మాచ్‌లను చూసేందుకు వీలుగా సీజన్‌ టికెట్‌ను కూడా ఇవ్వనున్నారు. ఈ టికెట్లను మ్యాచ్ వేదికల వద్ద తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

పోలికలు ఉన్నప్పటికీ చాలా తేడాలు

పోలికలు ఉన్నప్పటికీ చాలా తేడాలు

వాలీబాల్‌కు, బీచ్‌ వాలీబాల్‌కు పోలికలు ఉన్నప్పటికీ చాలా తేడాలు ఉంటాయి. సాధారణ వాలీబాల్‌లో ఆరుగురు ఆటగాళ్లు కోర్టులో ఉంటే బీచ్‌ వాలీబాల్‌ కేవలం ఇద్దరే ఆటగాళ్లే ఆడతారు. ఎఫ్‌ఐవిబి నిబంధనల మేరకు చిన్ని షార్ట్‌ లేదా బాతింగ్‌ సూట్‌తో, టాంక్‌ టాప్‌తో మాత్రమే ఆడతారు. పురుషులు టాప్‌ లేకుండా ఆడవచ్చు.

Story first published: Wednesday, February 27, 2019, 12:21 [IST]
Other articles published on Feb 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X